Guntur Kaaram: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. రివీలయ్యేది ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-08-08T20:00:09+05:30 IST

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పటికి ఎన్ని రకాలుగా వార్తలు రావాలో అన్ని రకాలుగా వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ఆగస్ట్ 09న మహేష్ బాబు బర్త్‌డే స్పెషల్‌గా ట్రీట్‌ని ఇవ్వబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలిపింది.

Guntur Kaaram: మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ట్రీట్ రెడీ.. రివీలయ్యేది ఎప్పుడంటే?
Mahesh Babu in Guntur Kaaram

మహేష్ బాబు (Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పటికి ఎన్ని రకాలుగా వార్తలు రావాలో అన్ని రకాలుగా వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి. ఇదిగో షూటింగ్ మొదలవ్వబోతుందని చెప్పడం.. మళ్లీ వెంటనే వాయిదా పడటం జరుగుతూ వస్తుంది. మహేష్ బాబు ప్రస్తుతం లండన్‌లో కుటుంబంతో సహా వెకేషన్‌లో వున్నారు. అసలీ సినిమా ఉంటుందా? అనే అనుమానాల వరకు వెళ్లి.. ఇప్పుడిప్పుడే కాస్త మళ్లీ పాజిటివ్‌గా వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ సినిమా విషయంలో అనుమానాల్లో ఉన్న ఫ్యాన్స్‌కి చిత్రయూనిట్ ఓ స్వీట్ న్యూస్‌ని ప్రకటించింది.


సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) పుట్టినరోజు (ఆగస్ట్ 09)ని పురస్కరించుకుని.. ఓ ట్రీట్ ఇవ్వబోతున్నట్లుగా తాజాగా నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. టైమ్‌తో సహా ఆయన చెప్పడంతో.. ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. పుట్టినరోజు స్పెషల్‌గా ఇవ్వబోతున్న ట్రీట్ విషయంలో కాకుండా.. ఆయన చేసిన పోస్ట్‌తో.. ‘గుంటూరు కారం’ సినిమా ఇంకా సజీవంగానే ఉందనేది కన్ఫర్మ్ అయినందుకు.. ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విషయంలో ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగిపోయినట్లుగానే తెలుస్తోంది. మహేష్ బాబు వెకేషన్ నుంచి రాగానే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారనేలా కూడా వార్తలు వచ్చేశాయి. ఇక ఇక్కడి నుంచి.. త్రివిక్రమ్ షూటింగ్‌ని పరుగులు పెట్టించే ప్రక్రియలో ఉన్నాడని, రాబోయే సంక్రాంతికి థియేటర్లలో బాబు దిగడం ఫిక్సయిపోవచ్చనేలా టాక్ అయితే వినిపిస్తోంది. (Guntur Kaaram Update)

Mahesh-Babu-GK.jpg

ఇక నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Naga Vamsi).. మహేష్ బాబు బర్త్ డే స్పెషల్ ట్రీట్‌ని ఆగస్ట్ 9వ తేదీ ఎర్లీ మార్నింగ్ 12 గంటల 06 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా అఫీషియల్‌గా ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ వంశీకి థ్యాంక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వంశీ పోస్ట్ అయితే చేశాడు కానీ.. ఏం విడుదల చేయబోతున్నారనే దానిపై మాత్రం ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి ఆ ట్రీట్ ఏంటో తెలియాలంటే.. నిర్మాత చెప్పిన టైమ్ వరకు వెయిట్ చేయాల్సిందే.. (Super Star Mahesh Babu)


ఇవి కూడా చదవండి:

***************************************

*Meher Ramesh: ఇంకా డ్రీమ్‌లోనే వున్నా.. నేను డైరెక్టర్ అయ్యింది ఈ సినిమా చేయడానికేనేమో!

***************************************

*Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

***************************************

*Pawan Kalyan: గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్


***************************************

*Upasana: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఉపాసన సంచలన నిర్ణయం

***************************************

*Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..

***************************************

Updated Date - 2023-08-08T20:11:58+05:30 IST