Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..

ABN , First Publish Date - 2023-08-07T23:09:11+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. ఈ సినిమా నుంచి ‘కొట్టరా కొట్టు తీనుమారు’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

Bholaa Shankar: చిరు తీనుమారు స్టెప్పులు.. థియేటర్లలో ఇక దుమ్ములేపుడే..
Bholaa Shankar Movie Still

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ (Meher Ramesh) దర్శకత్వం వహించారు. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుంది. మూవీ రిలీజ్‌కు కౌంట్ డౌన్ మొదలవ్వడంతో.. సినిమా ప్రమోషన్స్‌ను మేకర్స్ యమా దూకుడుగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించిన మేకర్స్.. తాజాగా మరో బిగ్ ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రం నుంచి తీనుమారు లిరికల్ సాంగ్‌తో దాదాపు ఫెస్టివల్ మూడ్ తీసుకొచ్చేశారు. (Kottara Kottu Teenumaaru Lyrical Song)


‘‘జిల్లెలే జిల్లెలే.. జింకనిక్క జిల్లెల్లే

లెలెలే మజాలే.. జిందగీకా మజాలే..

జోషు నింపు బేటా.. నువ్వున్న ప్రతీచోటా..

ఖుషి ఉండాలంటా.. నువ్వు చెప్పేలోగా టాటా..

కొట్టరా కొట్టు తీనుమారో.. కట్టలే తెగేలా హుషారో..

కొట్టరా కొట్టు తీనుమారో.. కట్టలే తెగేలా హుషారో..’’ అంటూ సాగిన ఈ పాటను మహతి స్వరసాగర్ గ్రాండ్ కార్నివాల్ ఎనర్జిటిక్ నెంబర్‌గా స్కోర్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ మెస్మరైజ్ చేయగా కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం పండగని రెట్టింపు చేసింది.

Chiru.jpg

ఈ పాటలో మెగాస్టార్ ఎనర్జిటిక్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ మూమెంట్స్ కన్నుల పండగలా వున్నాయి. ఫ్లూట్ తో చేసిన సిగ్నేచర్ స్టెప్ అవుట్ స్టాండింగ్‌గా వుంది. ఈ పాటలో కీర్తి సురేష్ కూడా మెగా ఎనర్జీని మ్యాచ్ చేశారు. చిత్ర తారాగణం అంతా కనిపించిన ఈ పాట బిగ్ స్క్రీన్‌పై చూడటానికి మెగా ట్రీట్‌లా వుండబోతుంది. రేపు థియేటర్లలో ఈ పాట దుమ్మురేపడం ఖాయం అనేలా.. మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో మెగాస్టార్‌కి చెల్లెలిగా కీర్తి సురేష్ ఓ కీలక పాత్రలో నటించింది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Pawan Kalyan: గుండెకు గొంతొస్తే.. బాధకి భాషొస్తే.. నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్


***************************************

*Upasana: ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత.. ఉపాసన సంచలన నిర్ణయం

***************************************

*Kushi: మహేష్ బాబు బర్త్‌డేకి విజయ్ దేవరకొండ ఇస్తోన్న ట్రీట్ ఇదే..

***************************************

*Jawan: మ‌రోసారి లుంగీ డ్యాన్స్‌తో.. ఈసారి దుమ్ములేచిపోవడం ఖాయం

***************************************

Updated Date - 2023-08-07T23:09:11+05:30 IST