సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kavya Kalyanram: నేనలా ఎక్కడా చెప్పలేదు.. దయచేసి ఆ వార్తలు ఆపండి

ABN, First Publish Date - 2023-07-12T19:58:51+05:30

కొన్ని మీడియా సంస్థలలో నాపై దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని నేను చెప్పినట్లుగా కథనాలను గమనించాను. నేనలా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా ‘బలగం’ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

Kavya Kalyanram
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyanram).. ఇటీవల వచ్చిన ‘బలగం’ (Balagam) చిత్రంతో మంచి విజయాన్ని, అదే స్థాయిలో గుర్తింపును అందుకున్న హీరోయిన్. అల్లు అర్జున్ (Allu Arjun) పరిచయం చిత్రం ‘గంగోత్రి’ చిత్రంలో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించిన ఈ భామ.. ఇప్పుడు హీరోయిన్‌గా మారి మంచి మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం కావ్య నటించిన ‘ఉస్తాద్’ (Ustaad) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో కీరవాణి తనయుడు శ్రీసింహా (Sri Simha) హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కావ్య తను కూడా బాడీ షేమింగ్ (Body Shaming) ఎదుర్కొన్నానని చెప్పినట్లుగా కొన్ని వార్తలు రెండు రోజులుగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై తాజాగా కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది.


‘‘కొన్ని మీడియా సంస్థలలో నాపై దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని నేను చెప్పినట్లుగా కథనాలను గమనించాను. నేనలా ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు. ఆ కథనాలు నిజం కావు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్యూ’’ అంటూ కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేశారు. ఆమె చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు కూడా సపోర్ట్ అందిస్తున్నారు. ఆ వార్తలు చూసి నిజమేనేమో అనుకున్నామనేలా రియాక్ట్ అవుతున్నారు. (Kavya Kalyanram on Rumours)

కావ్య కళ్యాణ్ రామ్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన ‘మసూద’ (Masooda), ‘బలగం’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాల తర్వాత ఆమె నటిస్తున్న ‘ఉస్తాద్’ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. వారాహి చ‌ల‌న‌చిత్రం, క్రిషి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఫ‌ణిదీప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘ఉస్తాద్‌’ చిత్రాన్ని ర‌జినీ కొర్ర‌పాటి, రాకేష్ రెడ్డి గ‌డ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Kushi Song: ‘ఆరాధ్య.. నువ్వేలేని ఏదీ వద్దు ఆరాధ్య’.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా..

**************************************

*Gandheevadhari Arjuna: అర్జునుడి రథంలోని అశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా..

**************************************

*Mahaveerudu: ‘మహావీరుడు’‌కి మాస్ మహారాజా సపోర్ట్.. ఏం చేశాడో తెలుసా?

**************************************

*Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది

**************************************

Updated Date - 2023-07-12T19:58:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!