Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది

ABN , First Publish Date - 2023-07-11T22:55:51+05:30 IST

విశాల్ హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ పేరుతో ఇప్పుడొక యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తెలిపారు.

Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ విడుదల తేదీ ఫిక్సయింది
Vishal in Mark Antony Movie

పాత్ర కోసం ఎంతైనా కష్టపడే హీరోలలో విశాల్ (Vishal) ఒకరు. ఆయన హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) పేరుతో ఇప్పుడొక యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్, హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో విశాల్‌కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) దర్శకత్వం వహిస్తుండగా.. ఎస్ వినోద్ కుమార్ (S Vinod Kumar) నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చివరి దశ పనులు జరుపుకుంటున్న ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా మేకర్స్ ప్రకటించారు.


ఈ సినిమాని వినాయక చవితి (Vinayaka Chaturthi) పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్లుగా తెలుపుతూ.. అధికారికంగా మేకర్స్ కొన్ని పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్స్‌లో మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్తగా రెట్రో లుక్‌తో కనిపించి సినిమాపై ఆసక్తి కలిగిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. విశాల్ ఇందులో గుబురు గడ్డంతో ఫైర్ చేస్తూ కనిపించడం.. అలాగే ఎస్.జె.సూర్య (SJ Suryah) కామెడీ టైమింగ్ ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. (Mark Antony Release Date)

Mark-Antony.jpg

మార్క్ ఆంటోనీ టైమ్ ట్రావెల్ థీమ్ చుట్టూ తిరిగే కథ. భారీ యాక్షన్ సన్నివేశాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలతో పాటు.. ఎస్.జె.సూర్య కామెడీ టైమింగ్ అన్నీ ప్రేక్షకులని అలరిస్తాయని, వినాయక చవితికి విడుదల చేస్తున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Nani30: ఫస్ట్ లుక్, గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే..

**************************************

*Taarakasura: ‘రావణాసుర’ కాదు.. ఇతను ‘తారకాసుర’

**************************************

*Dhwani: దర్శకుడిగా 10 ఏళ్ల పిల్లాడు.. అతని టార్గెట్ ఏంటో తెలుసా?

**************************************

*Bholaa Shankar: సెలబ్రేషన్ సాంగ్ వచ్చేసింది.. కీర్తి, తమన్నాలతో చిరు స్టెప్పులు

********************

*Mani Sharma: తెలుగు సినిమా ఇండస్ట్రీకి ‘మణి’హారం

**************************************

Updated Date - 2023-07-11T22:58:23+05:30 IST