Devara: తమ్ముడి సినిమా ‘దేవర’పై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్

ABN , First Publish Date - 2023-12-12T21:13:37+05:30 IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో.. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ను ‘డెవిల్’ హీరో కళ్యాణ్ రామ్ తెలిపారు.

Devara: తమ్ముడి సినిమా ‘దేవర’పై కళ్యాణ్ రామ్ ఇంట్రస్టింగ్ అప్‌డేట్
Kalyan Ram About Devara

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘దేవర’ (Devara). రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో.. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, కల్యాణ్‌రామ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీకపూర్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. బాలీవుడ్‌ స్టార్ యాక్టర్ సైఫ్‌ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఎన్టీఆర్ సోదరుడు, చిత్ర నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్‌ని ఇచ్చారు.

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ (Nandamuri Kalyan Ram) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడిక్ స్పై థ్రిల్ల‌ర్ ‘డెవిల్’ (Devil). ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ అనేది ట్యాగ్‌లైన్. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా (Abhishek Nama) దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో ‘డెవిల్’ విషయాలను చెప్పిన అనంతరం కళ్యాణ్ రామ్ తన తమ్ముడు యంగ్ టైగర్ ‘దేవర’ సినిమా గురించి కూడా మాట్లాడారు.


Kalyan-Devara.jpg

ఆయన మాట్లాడుతూ.. ‘‘తమ్ముడు ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ గురించి చెప్పాలంటే.. RRR వంటి సినిమా చేసిన తర్వాత ఓ యాక్టర్‌కి, ఓ డైరెక్టర్‌కి, ప్రొడక్షన్ హౌస్‌కి గాని ఎంతో బాధ్యత ఉంటుంది. చిన్నపాటి తప్పు జరిగినా ఎవరూ ఊరుకోరు. మేం తెలిసి తప్పు చేయం. బాధ్యతగా తీసుకుని ఎంత కష్టపడతామో మాకు తెలుసు. రేపు థియేటర్స్‌లో సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. త్వరలోనే గ్లింప్స్ రాబోతుంది. దానికి కావాల్సిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వి.ఎఫ్.ఎక్స్‌కి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే మేం ‘దేవర’ మూవీ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం. దయచేసి ఓపిక పట్టండి. త్వరలోనే గ్లింప్స్ డేట్‌ను టీమ్ అనౌన్స్ చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ‘దేవర’ తొలి భాగం 5 ఏప్రిల్‌, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Devara Update)


ఇవి కూడా చదవండి:

====================

*Srikanth Sriram: హారర్ సినిమాల విషయంలో నాకో భయం ఉంది.. అదేంటంటే?

**********************************

*SeshEXShruti: అడివి శేష్‌తో శృతిహాసన్.. ఇది ఎవరూ ఊహించలేదు కదా..

**********************************

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

***********************************

Updated Date - 2023-12-12T21:13:39+05:30 IST