Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

ABN , First Publish Date - 2023-12-10T15:48:04+05:30 IST

కింగ్ నాగార్జున అక్కినేని పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ ‘నా సామిరంగ’తో రాబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పండుగకు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న నాగార్జున.. విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మ్యాసీ, రగ్గడ్ అవతార్‌లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్.. ‘ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే’ని మేకర్స్ విడుదల చేశారు.

Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!
Naa Saami Ranga Movie Still

కింగ్ నాగార్జున అక్కినేని (King Nagarjuna Akkineni) పర్ఫెక్ట్ సంక్రాంతి (Sankranthi) మూవీ ‘నా సామిరంగ’ (Naa Saami Ranga)తో రాబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. పండుగకు గొప్ప ట్రాక్ రికార్డ్ ఉన్న నాగార్జున (Nagarjuna).. విజయ్ బిన్నీ (Vijay Binni) దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో మ్యాసీ, రగ్గడ్ అవతార్‌లో కనిపించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి మ్యాసీవ్ బడ్జెట్‌తో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి ‘ఎత్తికెళ్లిపోవాలనిపిస్తుందే..’ (Etthukelli Povaalanipisthunde) లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

ఆస్కార్ అవార్డ్- విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి (MM Keeravani), ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ (Chandra Bose).. నాగార్జునకు మరో చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించడానికి మరోమారు కొలబరేట్ అయ్యారు. మేకర్స్ మొదటి సింగిల్ ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుంది పాట విడుదల చేయడంతో మ్యూజిక్ ప్రమోషన్స్ గ్రాండ్‌గా ప్రారంభమయ్యాయి. ఎంఎం కీరవాణి ప్లజెంట్ వైబ్‌లను కలిగిన ఒక మెస్మరైజింగ్ మెలోడీని స్కోర్ చేశారు. రామ్ మిరియాల తన వోకల్స్‌తో కట్టిపడేశారు. చంద్రబోస్ మెలోడీ చార్ట్‌బస్టర్‌గా నిలిపే సాహిత్యాన్ని అందించారు.


King-Nagarjuna.jpg

ఈ పాటలో నాగార్జున, ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath)ల కెమిస్ట్రీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎప్పటిలాగే నాగార్జున తన హ్యాండ్సమ్ లుక్స్‌తో అందరి హృదయాలను కొల్లగొట్టగా, ఆషికా సాంప్రదాయక గెటప్‌లో ఆకట్టుకుంది. పాటలో విజువల్స్ గ్రాండ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పెప్పీ మెలోడీ చార్ట్-టాపింగ్ హిట్ అవుతుంది. 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించారు. ప్రస్తుతం ఈ పాట.. టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

*Neha Shetty: క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం

*************************************

*Guntur Kaaram: మహేష్‌కి ముద్దు.. సెకండ్ సింగిల్ రిలీజ్‌కు సర్వం సిద్ధమైనట్లే..

*********************************

Updated Date - 2023-12-10T15:48:05+05:30 IST