SeshEXShruti: అడివి శేష్‌తో శృతిహాసన్.. ఇది ఎవరూ ఊహించలేదు కదా..

ABN , First Publish Date - 2023-12-12T15:13:28+05:30 IST

అడివి శేష్‌తో శృతిహాసన్ నటించబోతోంది. శేష్ ఎక్స్ శృతి అంటూ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. శృతిహాసన్ ఆ మధ్య లవ్ అంటూ.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆమె ప్రేమాయణంలో కాస్త గందరగోళం నెలకొనడంతో తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమెకు మంచి హిట్స్ కూడా పడ్డాయి. ఇప్పుడు అడివి శేష్‌తో ఓ పాన్ ఇండియా సినిమాకు ఆమె ఓకే చెప్పింది.

SeshEXShruti: అడివి శేష్‌తో శృతిహాసన్.. ఇది ఎవరూ ఊహించలేదు కదా..
Adivi Sesh and Shruti Haasan

అడివి శేష్‌ (Adivi Sesh)తో శృతిహాసన్ (Shruti Haasan) నటించబోతోంది. శేష్ ఎక్స్ శృతి (SeshEXShruti) అంటూ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ని మేకర్స్ వదిలారు. శృతిహాసన్ ఆ మధ్య లవ్ అంటూ.. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఆమె ప్రేమాయణంలో కాస్త గందరగోళం నెలకొనడంతో తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమెకు మంచి హిట్స్ కూడా పడ్డాయి. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలతో హిట్స్ అందుకున్న శృతిహాసన్ రీసెంట్‌గా వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలోనూ మెరిసింది. ఇప్పుడు ప్రభాస్ సరసన ‘సలార్’తో సంచలనానికి సిద్ధమవుతోంది. రీ ఎంట్రీలో స్టార్ హీరోలకే ఇంపార్టెన్స్ ఇచ్చిన శృతి.. ఇప్పుడు యంగ్ హీరో శేష్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సిద్ధమైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో అడివి శేష్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును, స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. ఇటీవల వచ్చిన ‘మేజర్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న అడివి శేష్ (Adivi Sesh).. ఇప్పుడు తనకు ఎంతో పేరు తెచ్చిన ‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ (G2) సినిమా షూట్‌లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే.. తాజాగా కొత్త సినిమాని ప్రకటించాడు శేష్. Sesh EX Shruti అంటూ శృతిహాసన్‌తో ఓ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


shruti.jpg

ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మించనుంది. ఏషియన్ సునీల్ (Asian Suniel) సహనిర్మాతగా వ్యవహరించనున్నారు. యువ కెమెరామ్యాన్ షానిల్ డియో (Shaneil Deo) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతానికి మేకర్స్ ఈ వివరాలను మాత్రమే రివీల్ చేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే అడివి శేష్ ఇప్పటి వరకు సస్పెన్స్ థ్రిల్లర్స్‌తో అలరిస్తూ వస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ చూస్తుంటే.. ఇదొక లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఈ లవ్ స్టోరీతో శేష్ ఎలా మెప్పిస్తాడో చూడాల్సి ఉంది. ఈ సినిమా విషయమై శేష్.. శృతిహాసన్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసి తన ఆనందాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Naa Saami Ranga: చందమామకే పిల్లలు పుడితే.. నిన్ను చూపించి అన్నం తినిపిస్తాదే!

************************************

*Manushi Chhillar: నా గాళ్స్‌ గ్యాంగ్‌ని వెంటేసుకొని.. చుట్టొస్తా!

*******************************

Updated Date - 2023-12-12T15:13:30+05:30 IST