Ram Charan: రామ్ చరణ్‌ను ఆనంద్ మహీంద్రా ఏమన్నారో చూశారా..

ABN , First Publish Date - 2023-02-25T21:12:14+05:30 IST

‘మగధీర’ (Magadheera), ‘రంగస్థలం’ (Rangasthalam), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. ఇప్పుడు

Ram Charan: రామ్ చరణ్‌ను ఆనంద్ మహీంద్రా ఏమన్నారో చూశారా..
Mega Power Star Ram Charan

‘మగధీర’ (Magadheera), ‘రంగస్థలం’ (Rangasthalam), ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan).. ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై భారతీయతను చాటుతున్నారు. రామ్ చరణ్ అమెరికా వెళ్ళి 5 రోజులు అవుతుంది. అక్కడ జరిగే ప్రతి వేడుకలో చక్కటి నడవడికతో.. అందరి మనసులు గెలుచుకుంటున్నారు. గ్లోబల్ స్టార్ అనే పదానికి నిజమైన అర్థాన్ని ఆయన చేతల్లో చూపిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) కూడా.. తాజాగా రామ్ చరణ్‌ను అభినందిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఇంతకు ఆనంద్ మహీంద్రా ‘నాటు నాటు’ పాటకు రామ్ చరణ్‌తో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్న రామ్ చరణ్‌ను ప్రస్తుత ‘గ్లోబల్ స్టార్’ (Global Star Ram Charan) అంటూ ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

ఇక అమెరికాలో అడుగు పెట్టిన క్షణం నుంచి రామ్ చరణ్ చాలా బిజీ బిజీగా కనిపిస్తున్నారు.. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ (Good Morning America)షో, ‘ఏబీసీ న్యూస్’ (ABC News) ఇంటర్వ్యూ.. ఇంకా అభిమానులతో ముచ్చటిస్తూ క్రాస్ ఓవర్ సినిమాస్ చేయాలని ఉందనేలా ఆసక్తిని కనబరిచారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ శిల్పి జక్కన్న (Jakkanna)పై ప్రశంసల వర్షం కురిపించారు.

బేవెర్లీ హిల్స్‌లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో మెగా పవర్ స్టార్ సందడి మాములుగా లేదని చెప్పుకోవాలి. ‘ఆర్ఆర్ఆర్’కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డు (Spotlight Award) అందుకున్నారు. ‘హెచ్‌సీఏ అవార్డ్స్’ (Hollywood Critics Awards) వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’కు దక్కిన గౌరవానికి ఆయన పొంగిపోయారు. ఈ అవార్డుల వేడుకకు ప్రజెంటర్‌గా కూడా హాజరైన ఆయన.. ‘బెస్ట్ వాయిస్ / మోషన్ కాప్చర్ పెర్ఫార్మన్స్’ అవార్డును అనౌన్స్ చేసి.. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. ఈ అవార్డుల కార్యక్రమంలో ఆయన పక్కన నిలబడటమే ఓ గొప్ప అవార్డ్ అని నటి ఏంజెలా చెప్పారు. హాలీవుడ్ (Hollywood) సినిమాకు అవార్డ్ ఇచ్చే గౌరవం అందుకున్న ఏకైక హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి చెప్పినట్లుగా.. నిజంగా ఇది తెలుగు ప్రేక్షకులకు, భారతీయులకు ఇది ఎంతో గర్వకారణమైన క్షణమని చెప్పుకోవాలి. ఇక ఆస్కార్ సందడి (Oscar Event) మొదలు కాబోతోంది. అందులో ఈ మెగా పవర్ స్టార్ చేసే సందడి ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.


ఇవి కూడా చదవండి

*********************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T21:12:48+05:30 IST