Sai Tej: సుప్రీమ్ హీరో సాయి తేజ్‌కి 2023 గోల్డెన్ ఇయర్.. ఎలా అంటే?

ABN , First Publish Date - 2023-12-14T18:18:38+05:30 IST

సుప్రీమ్ హీరో సాయి తేజ్, సంయుక్తా మీనన్ హీరో‌హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్‌లో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విజయంతో సాయితేజ్‌ మళ్లీ కమ్ బ్యాక్ అయ్యారు. ఓటీటీలోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.

Sai Tej: సుప్రీమ్ హీరో సాయి తేజ్‌కి 2023 గోల్డెన్ ఇయర్.. ఎలా అంటే?
Sai Dharam Tej

సుప్రీమ్ హీరో సాయి తేజ్ (Supreme Hero Sai Tej), సంయుక్తా మీనన్ (Samyuktha Menon) హీరో‌హీరోయిన్లుగా నటించిన సినిమా ‘విరూపాక్ష’ (Virupaksha). కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వం వహించిన ఈ సినిమా సాయి తేజ్ కెరియర్‌లో మొదటి 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సక్సెస్‌కు సాయితేజ్, సంయుక్తా మీనన్‌లతో పాటు ముఖ్యపాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, సోనియా సింగ్, రవికృష్ణ వంటి వారి నటన కూడా తోడయ్యింది. ముఖ్యంగా అజినీస్ లోకనాథ్ అందించిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


Virupaksha.jpg

2023లో రిలీజ్ అయిన మూవీస్‌లో థ్రిల్లర్ జానర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘విరూపాక్ష’. యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌లో ఈ సినిమా విజయం కాన్ఫిడెన్స్‌ను నింపింది. థియేటర్లలో రిలీజై సంచలన విజయంతో నమోదు చేసుకున్న ఈ సినిమాలో ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకోవడం విశేషం. థియేటర్లలో చూసినప్పటికీ ఈ సినిమాని ఓటీటీలోనూ ప్రేక్షకులు వదల్లేదు. నెట్ ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా 2023 ఫస్టాఫ్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్‌లో 8.7 మిలియన్ వాచ్ అవర్స్ (అన్ని లాంగ్వేజెస్) సాధించినట్లుగా అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. దీంతో మరోసారి ‘విరూపాక్ష’ టైటిల్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం

************************************

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

*****************************************

Updated Date - 2023-12-14T18:18:39+05:30 IST