Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం

ABN , First Publish Date - 2023-12-14T16:52:24+05:30 IST

అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మెగాబ్రదర్ నాగబాబు నిర్మించిన ‘గుడుంబా శంకర్’ సినిమా రీ-రిలీజ్ ద్వారా సమకూరిన రూ.35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ని కలిసి చెక్ రూపంలో ఈ సొమ్మును అందజేశారు.

Gudumba Shankar: జనసేన పార్టీకి ‘గుడుంబా శంకర్’ రీ రిలీజ్ ఆదాయం
Nadendla Manohar and Nagababu

అంజనా ప్రొడక్షన్స్ (Anjana Productions) బ్యానర్ పై జనసేన పార్టీ (Janasena Party) ప్రధాన కార్యదర్శి, మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) నిర్మించిన ‘గుడుంబా శంకర్’ (Gudumba Shankar) సినిమా రీ-రిలీజ్ ద్వారా సమకూరిన రూ.35 లక్షలను జనసేన పార్టీకి మద్దతుగా అందజేశారు. గురువారం మంగళగిరి (Mangalagiri) కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)ని కలిసి చెక్ రూపంలో ఈ సొమ్మును అందజేశారు.

ఈ సందర్భంగా మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ... “అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రీ రిలీజ్ అయ్యే సినిమాల నుంచి వచ్చే ఆదాయంలో సింహ భాగం జనసేన పార్టీకి మద్దతుగా ఇవ్వడం ఆనందంగా ఉంది. ‘ఆరెంజ్’ (Orange) సినిమా రీ-రిలీజ్ సమయంలో రూ. 1.05 కోట్లు, ‘జల్సా’ (Jalsa) సినిమా రీ- రిలీజ్ సమయంలో కోటి రూపాయలు పార్టీకి అందించాం. ఇప్పుడు ‘గుడుంబా శంకర్’ సినిమా ద్వారా వచ్చిన ఆదాయంలో సింహభాగం రూ. 35 లక్షలు పార్టీకి మద్దతుగా అందజేశాం.


Janasena-Party.jpg

అంజనా ప్రొడక్షన్స్‌లో నిర్మాణమై రీ రిలీజ్ అవుతున్న సినిమాల ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం జనసేన పార్టీకి అందించాలని గతంలో నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనోహర్‌గారిని కలిసి రూ. 35 లక్షలు చెక్ అందించాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గారు చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది” అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Kushee Ravi: ఐకాన్ స్టార్, న్యాచురల్ స్టార్ అంటే ఇష్టం..

**********************************

*Salaar: ‘సూరీడే..’ పాట.. ‘సలార్’ స్ట్రెంత్ ఇది

*************************************

*Mass Combo: మ్యాజికల్ మాస్ కాంబో ఈజ్ బ్యాక్.. కాకపోతే ఇవే డౌట్స్!

*****************************************

*Guntur Kaaram: ‘గుంటూరు కారం’ రెండో గీతం ఎలా ఉందంటే..

*****************************************

Updated Date - 2023-12-14T16:52:25+05:30 IST