Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం

ABN , First Publish Date - 2023-02-22T21:56:13+05:30 IST

‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ (Oo Antava Mawa..Oo Oo Antava Mawa) పాటకి సినీ కపుల్

Madhumitha Sivabalaji: ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా’.. స్టెప్పులతో అరాచకం
Sivabalaji and Madhumitha Dance to Pushpa Movie Song

‘పుష్ప’ (Pushpa) సినిమాలోని ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ (Oo Antava Mawa..Oo Oo Antava Mawa) పాటకి సినీ కపుల్ శివబాలాజీ-మధుమిత (Sivabalaji and Madhumitha) కలిసి స్టెప్పులేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఈ వీడియోని శివబాలాజీ (Actor Siva Balaji) వైఫ్, నటి మధుమిత (Actress Madhumitha)నే ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేయడం విశేషం. ‘పుష్ప’లో సమంత చేసిన ఈ ఐటమ్ నెంబర్‌ (Item Song)కు.. ఆమెకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చిన విషయం తెలిసిందే. సినిమా విడుదల తర్వాత ఈ పాట అన్ని చోట్ల మారుమోగింది. గ్లోబల్‌గా గుర్తింపును పొందిన తెలుగు పాటలలో ఇది కూడా ఒకటి. సెలబ్రిటీలు చాలా మంది ఈ పాటకు స్టెప్పులేశారు. కానీ భార్యభర్తలైన శివబాలాజీ-మధుమిత కలిసి చేసిన స్టెప్పులు మాత్రం అరాచకం అనేలా ఉన్నాయనడంలో అస్సలు అతిశయోక్తి లేనే లేదు.

శివబాలాజీ- మధుమిత జోడి విషయానికి వస్తే.. వీరిద్దరూ హీరో, హీరోయిన్లుగా కెరీర్ ప్రారంభించి.. మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. సినిమాలు చేస్తున్న సమయంలోనే వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇరు వైపున ఉన్న పెద్దలు వారి ప్రేమను అంగీకరించడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరూ నటీనటులుగా కొనసాగుతున్నారు. మధుమిత మంచి పాత్ర అనుకుంటే మాత్రమే చేస్తుంది. శివ బాలాజీ అన్ని రకాల పాత్రలు చేస్తూ.. నటుడిగా ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ ఓ పార్టీకి అటెంట్ అయ్యారు. ఆ పార్టీలో ప్లే చేసిన ‘ఊ అంటావా మావ.. ఉఊ అంటావా మావ’ పాటకు ఇలా స్టెప్పులు కలిపారు. (Sivabalaji and Madhumitha Dance to Pushpa Song)

వీరి డ్యాన్స్ మూమెంట్స్ చూసిన నెటిజన్లు చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా మధుమిత ఎక్స్‌ప్రెషన్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా.. నైస్ కపుల్, మీ జోడీ చాలా బాగుంది, మళ్లీ సినిమాలు చేస్తూ.. బిజీ నటులుగా మారండి అనేలా నెటిజన్స్ రియాక్ట్ అయ్యారు. కొందరు సెలబ్రిటీలు కూడా ఈ వీడియోను లైక్ చేశారు. మొత్తంగా చూస్తే మాత్రం.. చాలా కాలం తర్వాత ఈ సినీ జంట మళ్లీ వార్తలలో నిలవడం విశేషమనే చెప్పుకోవాలి. (Cine Couple)

ఇవి కూడా చదవండి

*********************************

Meena: ‘శుభలగ్నం’ రీమేక్ చేస్తే చేయాలనుకున్నా.. కానీ?


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Premi Viswanath: అరుదైన వ్యాధి.. ‘కార్తీకదీపం’ వంటలక్క కూడా ఆ బ్యాచ్‌లోకి!

Ram Charan: ఆ ఘనత అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డ్

Updated Date - 2023-02-22T21:56:15+05:30 IST