Naga Susheela: కింగ్ నాగార్జున సోదరిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-09-18T17:28:17+05:30 IST

ఓ ల్యాండ్ వ్యవహారంలో కింగ్ నాగార్జున సోదరి అయిన నాగ సుశీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు‌పై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు.. 447 427 504 506 సెక్షన్ల కింద నాగ సుశీలపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం.

Naga Susheela: కింగ్ నాగార్జున సోదరిపై కేసు నమోదు
Naga Susheela

ఓ ల్యాండ్ వ్యవహారంలో కింగ్ నాగార్జున సోదరి (King Nagarjun Sister) అయిన నాగ సుశీల (Naga Susheela)పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు‌పై కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు.. 447 427 504 506 సెక్షన్ల కింద నాగ సుశీలపై కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. నాగ సుశీల‌తో పాటు 12 మంది కలిసి తనపై దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా పోలీసులు తెలుపుతున్నారు.

చింతలపూడి శ్రీనివాస్ విషయానికి వస్తే.. గతంలో నాగ సుశీలతో కలిసి శ్రీ నాగ్ కార్పొరేషన్ బ్యానర్ పార్టనర్‌గా చింతలపూడి శ్రీనివాసరావు (Chintalapudi Srinivasa Rao) కొనసాగారు. వీరిద్దరూ కలిసి పలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి వీరి మధ్య పోలీస్ కేసులు నడుస్తూనే ఉన్నాయి. గతంలోనూ చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల మధ్య పరస్పర ఫిర్యాదులు, కేసులు నమోదయ్యాయి. తనకు తెలియకుండా ల్యాండ్ విక్రయించారని గతంలో చింతలపూడి శ్రీనివాస్‌పై నాగ సుశీల (Naga Susheela vs Chintalapudi Srinivasas) ఫిర్యాదు చేశారు. ఇప్పుడేమో.. 12 మందితో నాగ సుశీల తనపై దాడి చేయించినట్లుగా చింతలపూడి శ్రీనివాసే పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Chiranjeevi: చిన్ని క్లీంకారతో వినాయక చవితి సెలబ్రేషన్.. పిక్స్ వైరల్

***********************************

*Mahima Nambiar: క్యాస్టింగ్ కౌచ్‌పై ఏమందంటే..

***********************************

*Anand Deverakonda: నేనే ఈ టీమ్‌లో కాస్త ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాడిని..

************************************

*Keedaa Cola: ఎట్టకేలకు ‘కీడా కోలా’కు మోక్షం లభించబోతోంది..

**********************************

Updated Date - 2023-09-18T17:28:17+05:30 IST