Biggboss-7 Grand Finale : బయటకు వచ్చేస్తే రవితేజ సినిమాలో ఆఫర్‌

ABN , First Publish Date - 2023-12-17T11:39:18+05:30 IST

బుల్లితెరపై సంచలన షోగా మారిన బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ ఆదివారంతో పూర్తవుతుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్‌ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. అయితే గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్‌ మహేష్‌ హాజరుకానున్నారని సోషల్‌ మీడియాలో ఓ వార్త రెండ్రోజులుగా వైరల్‌ అవుతోంది

Biggboss-7 Grand Finale : బయటకు వచ్చేస్తే రవితేజ సినిమాలో ఆఫర్‌

బుల్లితెరపై సంచలన షోగా మారిన బిగ్‌బాస్‌ ఏడో (Biggboss 7 సీజన్‌ ఆదివారంతో పూర్తవుతుంది. ఈ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్‌ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. అయితే గ్రాండ్‌ ఫినాలేకు ముఖ్య అతిథిగా సూపర్‌స్టార్‌ మహేష్‌ హాజరుకానున్నారని సోషల్‌ మీడియాలో ఓ వార్త రెండ్రోజులుగా వైరల్‌ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఆయన అతిథిగా హాజరైతే ఫినాలే ఓ స్థాయిలో ఉంటుంది. (biggboss Grand Finale)

Bb2.jpg

తాజాగా గ్రాండ్‌ ఫినాలేకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ప్రోమో చూస్తే స్టార్లతో సందడి సందడిగా ఉంది. గ్రాండ్‌ ఫినాలేలో స్టేజి మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయి బయటకు వెళ్లిన కంటెస్టెంట్స్‌ అందరూ బిగ్‌బాస్‌ షో.. తమ జీవితాలను మార్చేసిందని అనుభవాలను పంచుకున్నారు. ఇంకా సినీతారలు కూడా వేదికపై సందడి చేసినట్లు ప్రోమోలో చూపించారు. మాస్‌ మహారాజా రవితేజ హీరోగా సంక్రాంతికి విడుదల కానున్న ‘ఈగల్‌’ చిత్రాన్ని ‘బిగ్‌ బాస్‌ 7’ ఫినాలేలో ప్రమోట్‌ చేశారు. నాగార్జున హీరోగా నటిస్తున్న ‘నా సామి రంగ’ సినిమాలో కీలక పాత్రధారులు అయిన అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌ సైతం సందడి చేశారు. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ‘డెవిల్‌’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ చిత్ర బృందం కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా బిగ్‌బాస్‌ వేదికపై కనిపించారు. సుమ కనకాల తనయుడు రోషన్‌ నటించిన ‘బబుల్‌ గమ్‌’ సినిమా టీమ్‌ కూడా పాల్గొంది, యాంకర్‌ సుమ కాసేపు సందడి చేసింది. నాగార్జున కూడా సుమని ఓ ఆట ఆడుకున్నారు. ఈ మధ్యన ఓ ప్రెస్‌ కాన్ఫరె న్స్ లో జరిగిన స్నాక్స్‌, భోజనాల విషయాన్ని గుర్తు చేసి నవ్వించారు నాగార్జున.

Amar.jpg

Amar 105 రోజుల కష్టాన్ని వదిలేసాడు..

రవితేజ స్టేజ్‌ మీదకు ఎంట్రీ కాగానే కేరింతలు ఓ రేంజ్‌లో వచ్చాయి. అయితే రవితేజ రాగానే నాగ్‌ అమర్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు. ుఇప్పుడు గేట్స్‌ తెరుచుకుంటాయి.. నువ్వు గనుక బయటకు వచ్చేస్తే రవితేజ తదుపరి చిత్రంలో ఆఫర్‌ ఇస్తాడు.. నీకు 7 సెకెన్స టైమ్‌ అనగానే అమర్‌ ఏమీ ఆలోచించకుండా బయటకు వచ్చేసినట్లు ప్రోమోలో చూపించారు. 105 రోజులు కష్టపడ్డాడు. చివరి క్షణంలో రవితేజ పక్కన ఆఫర్‌ అనగానే ఆలోచించకుండా వచ్చేశాడు.. అని నాగ్‌ అనగానే ునాకు ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని రవితేజ అన్నారు.

BB-f.jpg

హీరోయిన్ల ఆటపాట...

కళ్యాణ్‌ రామ్‌ ‘డెవిల్‌’ హీరోయిన్‌ సంయుక్తా మీనన్‌, ‘నా సామి రంగ’ హీరోయిన్‌ ఆషికా రంగనాథ్‌, ‘బబుల్‌ గమ్‌’ హీరోయిన్‌ మానసా చౌదరి ఫినాలేలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీళ్ళిద్దరూ కాకుండా స్టేజ్‌ మీద ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు స్పెషల్‌ డ్యాన్స్‌ పెర్ఫార్మన్స్‌ ఇచ్చారు. ఇస్మార్ట్‌ బ్యూటీ నిధీ అగర్వాల్‌ ‘బిగ్‌ బాస్‌’ ఫినాలే ేస్టజిపై స్పెషల్‌ ఓ పాటకు స్టెప్పులేశారు. క్రేజీ హీరోయిన్‌ నేహా శెట్టి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ సినిమాలో ‘సుట్టంలా చూసి పోకలా’ పాటకు డ్యాన్స్‌ చేశారు. ‘వీర సింహా రెడ్డి’ సినిమాలో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి’ పాటలో సందడి చేసిన చంద్రికా రవి సైతం బిగ్‌బాస్‌ వేదికపై ఆడిపాడి అలరించారు. ప్రోమో చూస్తుంటే ఫినాలే దద్దరిల్లిపోయేలా ఉంది.

Updated Date - 2023-12-17T11:42:45+05:30 IST