Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..

ABN , First Publish Date - 2023-12-17T21:37:46+05:30 IST

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7కు ఈ ఆదివారంతో ముగింపు పడనుంది. ఎప్పటిలానే ఈసారి కూడా ఫినాలేను గ్రాండ్‌గా ప్రారంభించారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ మొదలైన ఈ షో.. ఒక్కోవారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ చివరికి టాప్ 6 మెంబర్స్‌గా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌ నిలిచారు. వీరిలో విన్నర్ ఎవరో కాసేపట్లో..

Bigg Boss Telugu 7 Grand Finale: టాప్ 6 కంటెస్టెంట్స్‌ నుండి అర్జున్ అవుట్..
Arjun in Bigg Boss

దాదాపు 105 రోజుల నుండి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్ 7కు ఈ ఆదివారంతో ముగింపు పడనుంది. ఎప్పటిలానే ఈసారి కూడా ఫినాలేను గ్రాండ్‌గా ప్రారంభించారు. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌ హౌస్‌లోకి అడుగుపెట్టగా.. ఒక్కోవారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ చివరికి టాప్ 6 మెంబర్స్‌గా పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్‌ దీప్‌, ప్రియాంక జైన్‌, ప్రిన్స్‌ యావర్‌, అంబటి అర్జున్‌ నిలిచారు. వీరిలో టైటిల్ విన్నర్ ప్రశాంత్‌ని వరించినట్లుగా ఆల్రెడీ లీక్స్ వచ్చేశాయి. మరి అది నిజమా కాదా? అనే ఆసక్తి కూడా అందరినీ టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. ప్రస్తుతం టాప్ 6 నుండి ఒకరు ఎలిమినేట్ అయ్యారు. టాప్ 6 నుండి అర్జున్ అంబటి ఎలిమినేట్ అయి స్టేజ్ మీదకి వచ్చారు. మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ దిశగా షో నడుస్తోంది.


King.jpg

ఈ గ్రాండ్ ఫినాలే షో ఎలా ప్రారంభం అయిందంటే..

బ్లాక్ కలర్ డ్రెస్‌లో కెజియఫ్ సినిమాలోని ‘ధీరా ఓ ధీరా’ పాటతో హోస్ట్ కింగ్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ షో ప్రారంభమైనప్పుడు కంటెస్టెంట్స్ ఎలా అయితే ఎంట్రీ ఇచ్చారో.. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన వారంతా కిరణ్ రాథోడ్, షకీలా మినహా ఒక్కొక్కరుగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్‌తో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ షోకు హాజరయ్యారు. టాప్ 6 మెంబర్స్‌లో కొన్ని పాటలకు డ్యాన్స్ చేయించారు. అనంతరం ఈ సీజన్‌‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వీడియోలను ప్లే చేశారు. వాటిని చూసి వచ్చిన వారంతా భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం నిధి అగర్వాల్ హాట్ హాట్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్ములేపింది.

Arjun-pic.jpg

ఆ తర్వాత హౌస్‌లో ఉన్న 6గురిని.. బిగ్‌బాస్ హౌజ్‌లో ఫేవరెట్‌ స్పాట్‌ ఏంటని హోస్ట్‌ నాగార్జున అడగగా.. వారు వారికి నచ్చిన ప్రదేశాలను చెప్పుకొచ్చారు. ఆ ఎపిసోడ్ ముగిశాక సుమ తన కుమారుడు హీరోగా చేస్తున్న ‘బబుల్‌గమ్’ ప్రమోషన్స్ కోసం స్టేజ్‌పైకి వచ్చింది. ‘బబుల్‌గమ్’ హీరోహీరోయిన్లతో సినిమా ముచ్చట్ల అనంతరం టాప్ 6 నుండి రోబో ఫైర్‌తో అర్జున్ ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయిన అర్జున్‌ని సుమ స్టేజ్‌పైకి తీసుకొచ్చారు.


ఇవి కూడా చదవండి:

====================

*Mr Bachchan: రవితేజ, హరీష్ శంకర్.. ఏందయ్యో ఈ స్పీడ్.. అప్పుడే క్లాప్ కూడా!

**********************************

*Sumaya: ‘డియర్ ఉమ’‌తో మల్టీ టాలెంట్‌ ప్రదర్శించబోతోన్న అనంతపురం అమ్మాయ్..

************************************

*Salaar: అభిమానులకు 100 టికెట్స్ ఇస్తానంటోన్న యంగ్ హీరో.. క్రేజ్ అలా ఉంది మరి!

*********************************

*Manchu Manoj: శోభా నాగిరెడ్డి బర్త్ యానివర్సరీ.. గుడ్ న్యూస్ చెప్పిన మంచు మనోజ్

******************************************

Updated Date - 2023-12-17T22:15:59+05:30 IST