Bholaa Shankar: టికెట్ల రేటు పెంచాలని కోరిన ‘భోళాశంకర్’ దరఖాస్తును తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2023-08-09T20:42:32+05:30 IST

టికెట్ల రేటు పెంచాలని కోరిన ‘భోళా శంకర్’ మూవీ నిర్మాతల దరఖాస్తును ఏపీ ప్రభుత్వం తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్‌’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కాబోతోన్న నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని.. మేకర్స్ ప్రభుత్వాన్ని కోరారు.

Bholaa Shankar: టికెట్ల రేటు పెంచాలని కోరిన ‘భోళాశంకర్’ దరఖాస్తును తిరస్కరించిన ఏపీ ప్రభుత్వం
Bholaa Shankar Movie Still

టికెట్ల రేటు పెంచాలని కోరిన ‘భోళా శంకర్’ (Bholaa Shankar) మూవీ నిర్మాతల దరఖాస్తును ఏపీ ప్రభుత్వం (AP Government) తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar). స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌‌ను నిర్మించారు. ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానున్న నేపథ్యంలో నిర్మాతలు ఏపీ ప్రభుత్వానికి టికెట్ రేట్లు పెంచుకునే (Ticket Price Hike) వెసులుబాటుని కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేయగా.. ఏపీ ప్రభుత్వం కొన్ని కారణాలతో ఈ ధరఖాస్తును తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ కారణాలు ఏమిటంటే..


bholaashankar.jpg

టికెట్ల ధరల పెంపు నిమిత్తం ప్రభుత్వానికి సమర్పించిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, దరఖాస్తుతో పాటు జత చేయాల్సిన పలు డాక్యుమెంట్లు ఇవ్వలేదని ప్రభుత్వ వర్గాలు.. ఈ దరఖాస్తును తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. అందుకు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందిగా ‘భోళా శంకర్’ సినిమా టీమ్‌కు తెలిపామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ‘భోళా శంకర్’ చిత్ర (Bholaa Shankar Movie) టికెట్ల పెంపుపై సందిగ్ధత తొలగలేదు. రీసెంట్‌గా చిరంజీవి ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు, ఈ సినిమాకు ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లుగా తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

***************************************

*Vijay Deverakonda: పెళ్లి మీద ఇష్టం పెరిగింది.. త్వరలోనే ఆ ఛాప్టర్‌లోకి..

***************************************

*Guntur Kaaram: ఫస్ట్ పోస్టర్‌పై వచ్చిన విమర్శలతో.. మహేష్ బాబు ఫ్యాన్స్‌కి మరో మాస్ పోస్టర్

***************************************

*Nagababu: మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన లేదు కానీ.. నిజం మాట్లాడిన వ్యక్తిపై విషం కక్కుతారా?

***************************************

*Anil Sunkara: ‘భోళా శంకర్’ చేసేటప్పుడు.. మహేష్ బాబు ఏం చెప్పారంటే..

***************************************

*Jr NTR: కిర్రాక్.. లుక్ అదిరింది.. ఏమున్నాడ్రా బాబు..!

***************************************

*Rajini and Chiru: అక్కడ రజనీకాంత్.. ఇక్కడ చిరంజీవి.. ఇలా తగులుకున్నారేంటయ్యా..

***************************************

Updated Date - 2023-08-09T20:42:32+05:30 IST