Abhishek Agarwal: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కి రెండు జాతీయ అవార్డులు.. నిర్మాత స్పందన ఇదే

ABN , First Publish Date - 2023-08-25T20:52:18+05:30 IST

‘‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల సినిమా. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు’’ అని అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

Abhishek Agarwal: ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కి రెండు జాతీయ అవార్డులు.. నిర్మాత స్పందన ఇదే
Abhishek Agarwal

‘‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’కు రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రజల సినిమా. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు’’ అని అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. ‘69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం రెండు అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, అలాగే ఉత్తమ సహాయనటిగా పల్లవి జోషి అవార్డులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ అగర్వాల్ శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో మా ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రానికి రెండు అవార్డులు దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిగారికి, పల్లవి జోషిగారికి, ఈ చిత్రం కోసం పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ఇది ప్రజల సినిమా. ప్రజలు ఎంతో గొప్పగా ఆదరించారు. ఈరోజున దేశ ప్రజలే ఈ అవార్డు గెలుచుకున్నారు. దేశ ప్రజలకు, కశ్మీర్‌ పండిట్లందరికీ ఈ పురస్కారాల్ని అంకితమిస్తున్నామని అన్నారు.

Abhi.jpg

ఇంకా మాట్లాడుతూ.. ‘‘జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌గారు అవార్డ్ పొందడం చాలా అనందంగా వుంది. రాజమౌళిగారి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆరు జాతీయ అవార్డులు రావడం, ఉప్పెన చిత్రానికి, కొండపొలం పాటకి చంద్రబోస్‌గారికి అవార్డులు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ‘కార్తికేయ 2’ తర్వాత మేము నిర్మిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం. పాన్ ఇండియా ఆడియన్స్ అలరించే కంటెంట్ ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఉంది. అక్టోబర్ 20న విడుదల చేస్తున్నాం. దానికి కూడా జాతీయ అవార్డ్ రావాలని కోరుకుంటున్నాను. మీడియా, ప్రేక్షకులందరి సహకారం కావాలి’’ అని కోరారు.


ఇవి కూడా చదవండి:

============================

*Jawan: షారుఖ్ ఖాన్ ఎన్ని గెటప్స్‌లో కనిపించబోతున్నాడో చూశారా.. పోస్టర్ అదిరింది

**************************************

*Allu Arjun: బన్నీ ఇంట్లో ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన పుష్పరాజ్

***************************************

*Allu Arjun: జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు

***************************************

*Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

***************************************

Updated Date - 2023-08-25T20:52:18+05:30 IST