Jawan: షారుఖ్ ఖాన్ ఎన్ని గెటప్స్‌లో కనిపించబోతున్నాడో చూశారా.. పోస్టర్ అదిరింది

ABN , First Publish Date - 2023-08-25T18:03:34+05:30 IST

SRKలోని ప‌లు పార్వ్శాల‌ను తెర‌మీద ఆవిష్క‌రించబోయే రోజు దగ్గరికి వచ్చేసింది. కేలండ‌ర్ల‌లో సెప్టెంబ‌ర్ 7 కోసం అభిమానులెందరో ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. షారుఖ్ ఖాన్ హీరోగా న‌టిస్తున్న సినిమా ‘జ‌వాన్‌’. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. తాజాగా ఈ సినిమాలో షారూఖ్ గెటప్స్ అన్నింటిని కలిపి ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Jawan: షారుఖ్ ఖాన్ ఎన్ని గెటప్స్‌లో కనిపించబోతున్నాడో చూశారా.. పోస్టర్ అదిరింది
Jawan Movie Poster

SRKలోని ప‌లు పార్వ్శాల‌ను తెర‌మీద ఆవిష్క‌రించబోయే రోజు దగ్గరికి వచ్చేసింది. కేలండ‌ర్ల‌లో సెప్టెంబ‌ర్ 7 కోసం అభిమానులెందరో ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా న‌టిస్తున్న సినిమా ‘జ‌వాన్‌’ (Jawan). కోలీవుడ్ స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార (Nayanthara) హీరోయిన్‌గా న‌టిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా ప్రివ్యూని మేకర్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి షారుఖ్‌ ఖాన్ తెర మీద ఎన్ని కోణాల్లో క‌నిపిస్తారోన‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్రా వ్యాపించింది. ఈ సినిమాలో యాక్ష‌న్ ఏ రేంజ్‌లో ఉంటుందో అనేది ప్రివ్యూలోనే క్లారిటీ ఇచ్చేశారు.


యాక్ష‌న్ గురించి జ‌నాలు ఎంత‌గా మాట్లాడుకుంటున్నారో, జ‌వాన్ సినిమాలో షారుఖ్‌ ఖాన్ ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపిస్తారోన‌నే విష‌యం గురించి కూడా అంతే క్యూరియాసిటీ ప్రేక్షకులలో ఉంది. అసలిందులో షారూఖ్ ఎన్ని గెటప్స్‌లో కనిపించనున్నారో అనేలా సెర్చింగ్‌లు కూడా మొదలయ్యాయట. ఇది గమనించిన మేకర్స్.. సినిమాలోని ఆయ‌న గెట‌ప్పుల‌న్నింటినీ సింగిల్ ఫ్రేమ్‌లోకి తెచ్చే విధంగా కొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇందులోని ఐదు డిఫ‌రెంట్ లుక్స్ ప్రేక్ష‌కుల‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక‌దానితో ఇంకోదానికి పోలిక లేకుండా, ప్ర‌తి అవ‌తార్‌లోనూ త‌నకు తానే సాటి అన్నంత వైవిధ్యంతో షారూఖ్ ఇందులో మెప్పిస్తున్నారు. (Shah Rukh Khan Jawan Update)

Jawan.jpg

ఈ పోస్ట‌ర్ చూసిన అభిమానులైతే షారుఖ్ ఖాన్ నెవ‌ర్ సీన్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రేక్ష‌కుల‌కు కనువిందు చేయబోతున్నారనేలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేట‌ర్ల‌కు వెళ్దామా? అని ఎదురుచూస్తున్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. జ‌వాన్ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌మ‌ర్పిస్తుండగా.. కోలీవుడ్ దర్శకుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌర‌వ్ వ‌ర్మ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెప్టెంబ‌ర్ 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా హిందీ, తెలుగు, త‌మిళ్‌లో విడుద‌ల కానుందీ చిత్రం.


ఇవి కూడా చదవండి:

============================

*Allu Arjun: బన్నీ ఇంట్లో ‘పుష్ప’ సంబరాలు.. సుకుమార్‌ని పట్టుకొని ఏడ్చేసిన పుష్పరాజ్

***************************************

*Allu Arjun: జాతీయ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి తెలుగు నటుడు

***************************************

*Bhagavanth Kesari: మ్యూజికల్ ప్రమోషన్స్‌లో బాలయ్య ‘భగవంత్ కేసరి’.. ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..?

***************************************

Updated Date - 2023-08-25T18:03:34+05:30 IST