Trisha: ఈ ఫీట్ త్రిషకు మాత్రమే సాధ్యమైంది

ABN, First Publish Date - 2023-11-10T18:46:49+05:30 IST

కాస్త గ్యాప్ తర్వాత త్రిష మళ్లీ తన సత్తా చాటుతోంది. సీనియర్ స్టార్ హీరోల చిత్రాలలో వరుస అవకాశాలను పట్టేస్తూ బిజీ హీరోయిన్‌గా దూసుకెళుతోంది. పొన్నియిన్ సెల్వన్, లియో తర్వాత ఆమెకు కమల్ హాసన్ సినిమాలో ఛాన్స్ వరించింది.