Trisha: మెగాస్టార్ చిరంజీవి బాటలో ‘త్రిష’ చిత్రం..

ABN , First Publish Date - 2023-11-09T19:57:11+05:30 IST

మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదేంటంటే.. తాను నటిస్తున్న 156వ చిత్రాన్ని పాటల రికార్డింగ్‌తో స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమాని పాటల రికార్డింగ్‌తో మొదలెట్టినట్లుగా మెగాస్టారే ప్రకటించారు. ఇప్పుడిదే బాటలో యువ దర్శకుడు ఆర్.కె గాంధీ డైరెక్ట్ చేస్తున్న ‘త్రిష’ చిత్రం నడుస్తోంది. తాజాగా ఈ చిత్రాన్ని కూడా పాట రికార్డింగ్‌తో ప్రారంభించారు.

Trisha: మెగాస్టార్ చిరంజీవి బాటలో ‘త్రిష’ చిత్రం..
Mega 156 and Trisha Posters

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ మధ్య కొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అదేంటంటే.. తాను నటిస్తున్న 156 (Mega156)వ చిత్రాన్ని పాటల రికార్డింగ్‌తో స్టార్ట్ చేశారు. రీసెంట్‌గా ఈ సినిమాని పాటల రికార్డింగ్‌తో మొదలెట్టినట్లుగా మెగాస్టారే ప్రకటించారు. ఇప్పుడిదే బాటలో యువ దర్శకుడు ఆర్.కె గాంధీ (RK Gandhi) తన తాజా చిత్రాన్ని ప్రారంభించారు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) తర్వాత దేవుళ్ళ పాత్రలు పోషించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సీనియర్ హీరో సుమన్ ప్రధానపాత్రలో ఆర్.కె. గాంధీ ‘త్రిష’ (RK Gandhi Trisha Movie) అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సంభవామి యుగే యుగే’ అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. స్నేహాలయం క్రియేషన్స్- బి.ఆర్ మూవీస్ పతకాలపై రవీంద్ర బూసం - ఈశ్వర్ నాగనాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Trisha-Team.jpg

కిరణ్ కుమార్ గుడిపల్లి సమర్పణలో హనుమంత రాయప్ప లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా (ML Raja) సంగీతంతో పాటు సాహిత్యం సైతం సమకూర్చుతున్నారు. ‘త్రిష’ చిత్రం కోసం సింగర్ సాయి చరణ్ ఆలపించిన గీతాన్ని అభేరి స్టూడియోలో నవంబర్ 8వ తేదీన రికార్డింగ్ చేశారు. ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రాన్ని కర్ణాటకలోనూ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నామని మేకర్స్ తెలిపారు. ఒక దివ్యాంశ సంభూతుడు దుష్టశక్తులను, దుష్టపన్నాగాలను ఎలా అరికట్టాడు? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కాలకేయ ప్రభాకర్, సురేష్ సూర్య, ఖుషీ గౌడ్, యువీన, కృష్ణేంద్ర, ధీరజ్ అప్పాజీ, ఆనంద్ మట్ట తదితరులు ఇతర పాత్రలలో నటించనున్నారు. (Trisha Movie Update)


ఇవి కూడా చదవండి:

========================

*Kannappa: ‘కన్నప్ప’కు అదే కరెక్ట్ అంటోన్న మంచు విష్ణు

*************************************

*NBK109: బాలయ్య మరో మాస్ రాంపేజ్ అప్‌డేట్.. పిక్ అదిరింది

*************************************

*Dum Masala: ‘గుంటూరు కారం’ దమ్ మసాలా సాంగ్ టాకేంటి?

*************************************

Updated Date - 2023-11-09T19:57:12+05:30 IST