Yendira Ee Panchayathi Glimpse: నువ్వేమైనా అర్జున్ రెడ్డి హీరోవా?

ABN , First Publish Date - 2023-08-22T21:17:32+05:30 IST

విలేజ్ డ్రామా, లవ్ స్టోరీస్ ఈ మధ్య తెలుగు సినిమా ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాయి. ప్రేమ కథను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్లు విజయాన్ని సాధిస్తున్నారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా ఉంటుందని.. ఆడియెన్స్‌ని అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని విడుదల చేశారు.

Yendira Ee Panchayathi Glimpse: నువ్వేమైనా అర్జున్ రెడ్డి హీరోవా?
Yendira Ee Panchayathi Movie Still

విలేజ్ డ్రామా, లవ్ స్టోరీస్ ఈ మధ్య తెలుగు సినిమా ప్రేక్షకులని బాగా అలరిస్తున్నాయి. ప్రేమ కథను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్లు విజయాన్ని సాధిస్తున్నారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ (Yendira Ee Panchayathi) అనే సినిమా కూడా ఉంటుందని.. ఆడియెన్స్‌ని అలరిస్తుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం (M Pradeep Kumar) నిర్మిస్తుండగా.. ఈ చిత్రంతో గంగాధర.టి (Gangadhara T) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.


ఇంతకు ముందు విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లోగో సోషల్ మీడియాలో మంచి స్పందనను దక్కించుకుని.. అందరూ ఈ సినిమాపై ఓ లుక్ వేసేలా చేసింది. ఊరి వాతావరణం, ఊర్లోని పలు భిన్న మనస్తత్వాలు, లక్షణాలున్న మనుషుల మధ్య సాగే సినిమా అనేలా.. ప్రేక్షకులతో ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Yendira Ee Panchayathi Glimpse)

‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ డైలాగ్‌తో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది. ‘ఎవరే..’ అని హీరోయిన్ ఫ్రెండ్ అడిగితే.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం.. ‘యమునా.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడం.. ‘నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’ అని హీరోయిన్ డైలాగ్ ఇలా గ్లింప్స్ మొత్తం కూడా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తోంది. మొత్తంగా అయితే ఓ మంచి పల్లెటూరి వాతావరణంలో జరిగే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతుందనేది మాత్రం ఈ గ్లింప్స్‌తో తెలుస్తోంది. మ్యూజిక్, కెమెరా వర్క్ హైలెట్ అనేలా ఉన్నాయి. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

***************************************

*Varun Tej: కమర్షియల్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నారు.. కానీ?

***************************************

*Jawan: ఒక్కరు కాదు, ఇద్దరు కాదు.. 6గురు యాక్షన్ డైరెక్టర్స్.. ‘జవాన్’ రేంజ్ ఇది

***************************************

*Pawan Kalyan: అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు

***************************************

*GOAT: మాస్ రగ్డ్ లుక్‌లో సుడిగాలి సుధీర్.. బీజీఎమ్ అదిరింది

***************************************

Updated Date - 2023-08-22T21:17:32+05:30 IST