Manchu family: సొంత మనిషినే ఎందుకు విష్ణు కొట్టడానికి ప్రయత్నం చేసాడు

ABN , First Publish Date - 2023-03-24T12:36:31+05:30 IST

సారధి అనే వ్యక్తి మంచు కుటుంబంతో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్నాడు. అతను మంచు కుటుంబంలో ఎవరు ఎక్కడికి వెళ్లిన వాళ్ళతో అంటిపెట్టుకునే ఉంటాడు, ముఖ్యంగా పెద్దాయన మోహన్ బాబుతో. మరి అలంటి సారధిని విష్ణు ఎందుకు కొట్టాలి అనుకున్నాడో...

Manchu family: సొంత మనిషినే ఎందుకు విష్ణు కొట్టడానికి ప్రయత్నం చేసాడు

నిన్న మొన్నటి వరకు బాగానే వున్న మంచు కుటుంబం (Manchu family) ఒక్కసారిగా రోడ్డెక్కింది. మంచు అన్నదమ్ములు విష్ణు (Manchu Vishnu), మనోజ్ (Manchu Manoj) మధ్య గొడవలు భగ్గుమన్నాయి. అయితే ఇక్కడ ఆసక్తికర అంశం ఏంటి అంటే, మంచు విష్ణు అదే కుటుంబ మనిషి అయినా సారధి (Saradhi) ని కొట్టడానికి ఎందుకు అతని ఇంటికి వెళ్లినట్టు. ఎందుకంటే సారధి మంచు కుటుంబానికి చాలా నమ్మిన బంటు. అతను ఎన్నో ఏళ్ల నుండి మంచు కుటుంబం (Manchu family) తో అంటి పెట్టుకొని వున్నాడు. మంచు కుటుంబం పెద్దాయన మోహన్ బాబు (Mohan Babu) ఎక్కడికి వెళ్లినా సారధి ముందు ఉండి అన్నీ చూసుకునేవాడు.

manchuvishnu.jpg

ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళకి సారధి మంచు కుటుంబానికి ఎంతటి విశ్వాసపాత్రుడో అందరికీ తెలుసు. అలాంటి సారధిని ఎందుకు విష్ణు కొట్టాలని ప్రయత్నం చేసాడు. ఏమి జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారు. మంచు మనోజ్ ఫిలిం నగర్ (Film Nagar) దగ్గర వున్న మోహన్ బాబు ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇల్లు మోహన్ బాబు తన కూతురు లక్ష్మి కి (Manchu Lakshmi) ఇచ్చేసారు. అప్పటినుండి లక్ష్మి ఇక్కడ ఉంటోంది, మోహన్ బాబు శంషాబాద్ దగ్గర వున్న ఇంట్లోకి వెళ్లిపోయారు. అక్కడే పెద్ద కొడుకు విష్ణు కూడా ఉంటున్నాడు.

manchufamily2.jpg

లక్ష్మి కి చిన్న తమ్ముడు మనోజ్ కి అనుబంధం ఎక్కువ మొదటి నుండీ. అందుకని మనోజ్ ఎప్పుడూ ఫిలిం నగర్ లక్ష్మి ఇంట్లో ఉంటూ ఉంటాడు. అలాగే అతను భూమా మౌనిక తో వున్నప్పుడు కూడా లక్ష్మి ఇంట్లోనే ఉండేవాడు. మనోజ్ వివాహం కూడా లక్ష్మి దగ్గరుండి, తన ఇంట్లోనే జరిపించింది. అయితే విష్ణు ఆ వివాహం లో ఆంటీ అంటనట్టుగానే వున్నాడు. అతనికి మనోజ్, భూమా మౌనికను చేసుకోవటం మరి ఇష్టం లేదేమో అని కూడా కొందరు అంటున్నారు.

ఆది ఆలా ఉంచితే, మంచు విష్ణు ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేసాడు, అది అతనే చూసుకుంటున్నాడు. అలాగే తిరుపతి లోని మోహన్ బాబు విశ్వవిద్యాలం బాధ్యతలు కూడా ఎక్కువ విష్ణు నే చూసుకుంటాడు. మనోజ్ మొదటి నుండీ కూడా వీటన్నిటికీ దూరంగా ఉంటూ వచ్చాడు.

అయితే మనోజ్ వివాహం అయ్యాక, బయటకి వచ్చినప్పుడు సారధి ఎక్కువగా మనోజ్ తో ఉంటున్నాడు అని తెలిసింది. ఇద్దరి అన్నదమ్ముల మధ్య కొంచెం సమాచార లోపం ఏర్పడి, ఆ వివాదం మొత్తం సారధి మీద పది ఉండొచ్చు అని కుటుంబానికి సన్నిహితంగా వున్నవాళ్లు అంటున్నారు. తమ్ముడిని ఏమీ అనలేక, సారధి ని కొట్టడానికి వెళ్ళాడు విష్ణు అని కూడా అంటున్నారు.

ఈలోగా మోహన్ బాబు కి విషయం తెలిసి, ఇద్దరి కొడుకుల మీద ఆగ్రహం చెందినట్టుగా తెలుస్తోంది. మనోజ్ ని పిలిచి ముందు ఆ వీడియో సాంఘీక మాధ్యమం లోంచి తీసెయ్యమని చెప్పారని తెలిసింది. అయితే సారధి మంచు కుటుంబానికి వ్యతిరేకంగా ఏమి చెయ్యడని మాత్రం అందరికి తెలుసు, కానీ మరి విష్ణు కి కోపం తెప్పించే పని ఏమి చేసాడో త్వరలోనే తెలుస్తుంది.

Updated Date - 2023-03-24T12:36:32+05:30 IST