Suhas: మ్యారేజ్ బ్యాండులో వర్కర్‌గా.. మేళం మొదలయ్యేది ఎప్పుడంటే?

ABN , First Publish Date - 2023-04-10T18:54:32+05:30 IST

సుహాస్‌ కెరీర్‌ని ఇంకో మెట్టు ఎక్కించే సినిమాగా ఈ సినిమా ఉంటుందనేలా ఈ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌తోనే మేకర్స్

Suhas: మ్యారేజ్ బ్యాండులో వర్కర్‌గా.. మేళం మొదలయ్యేది ఎప్పుడంటే?
Hero Suhas New Film

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ మొదలు పెట్టి.. ‘కలర్ ఫొటో’, ‘రైటర్ పద్మభూషణ్’ వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరో సుహాస్. ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన సుహాస్.. యూత్‌కి నచ్చే కాన్సెప్ట్ బేస్ట్ సినిమాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తోనూ మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఇప్పుడాయన హీరోగా ప్రముఖు నిర్మాత సంస్థ జీఏ 2 పిక్చర్స్ (GA2 Pictures) బ్యానర్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు’ (Ambajipeta Marriage Band) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లుగా ఇంతకు ముందే ఓ ప్రకటన వచ్చింది. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్ (Swecha Creations), మహా క్రియేషన్స్ (Maha Creations) బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు (Bunny Vas), దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) సమర్పిస్తుండగా.. ధీరజ్ మొగిలినేని (Dheeraj Mogilineni) ఈ సినిమాను నిర్మించారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలకు సంబంధించిన వివరాలు తెలుపుతూ.. సోమవారం మేకర్స్ ఓ పోస్టర్‌ని వదిలారు. ఈ పోస్టర్‌లో సినిమా టైటిల్‌కు తగినట్లుగా.. మ్యారేజ్ బ్రాండుకు సంబంధించిన సంగీత పరికరాలను చూపించారు. ఈ సినిమాలో మల్లి (Malli)గా సుహాస్ నటించినట్లుగా చెబుతూ.. హీరో పేరుని రివీల్ చేశారు. సగం మనిషి కనిపిస్తున్న పిక్‌తో పాటు.. ఈ వేసవికి మోత మోగిపోద్ది! అంటూ విడుదలకు సంబంధించి హింట్ కూడా ఇచ్చేశారు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను 11-04-2023న విడుదల చేయబోతున్నట్లుగా డేట్‌ని కూడా ఈ పోస్టర్‌లో తెలియజేశారు. మొత్తంగా సుహాస్‌ కెరీర్‌ని ఇంకో మెట్టు ఎక్కించే సినిమాగా ఈ సినిమా ఉంటుందనేలా ఈ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌తోనే మేకర్స్ ఆసక్తిని క్రియేట్ చేశారు. (Ambajipeta Marriage Band First Look Announcement)

మ్యారేజ్ బ్యాండ్‌లో పనిచేసే మల్లి అనే కుర్రాడిగా సుహాస్ నటిస్తున్న ఈ చిత్రంతో దుశ్యంత్ కటికనేని (Dushyanth Katikineni) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. వేసవికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి:

*********************************

*Renu Desai: నా బాధ అర్థం చేసుకునే వ్యక్తి ఉన్నందుకు ధైర్యంగా ఉంది

*MM Keeravani: వాళ్లు మూలవిరాట్లు.. మేము ఉత్సవ విగ్రహాలం

*Allu Aravind: రాజమౌళితో ‘మగధీర’ తీశానని గర్వంగా చెప్పుకుంటున్నా..

*Heroine-Director: ఇది కదా.. ఇప్పుడు ట్రెండ్!

*NT Ramarao: రాయలుగా రాజసం ఒలికించారు

*Vijay Sethupathi: బంకమట్టిలా నిల్చున్నాను అంతే.. నన్ను ఆయనే మలిచాడు

*Pavitra and Naresh: ప్రేమచిహ్నాలతో.. పెళ్లికి సంబంధించిన మరో అప్‌డేట్

Updated Date - 2023-04-10T18:54:33+05:30 IST