Pindam Trailer: ఒక్కొక్కరినీ వణికిస్తోన్న 3 నిమిషాల 45 సెకన్ల ట్రైలర్

ABN , First Publish Date - 2023-12-07T13:35:45+05:30 IST

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం భయపెడుతోంది.

Pindam Trailer: ఒక్కొక్కరినీ వణికిస్తోన్న 3 నిమిషాల 45 సెకన్ల ట్రైలర్
Pindam Movie Posters

ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉపశీర్షిక. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా (Saikiran Daida) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా (Kalaahi Media) బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి (Yeshwanth Daggumati) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతుండగా.. తాజాగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 45 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ ఆద్యంతం మేకర్స్ చెప్పినట్లుగానే భయపెట్టేస్తోంది.

ఈశ్వరీ రావుతో ‘మరణం అనేది నిజంగానే అంతమా?. మరణించిన తరువాత ఏం జరుగుతుంది అనేది ఎవరైనా చెప్పగలరా?. కోరికలు తీరని వారి ఆత్మలు ఈ భూమ్మీద నిలిచిపోతాయా?. ఆ ఆత్మలు మనకు నిజంగానే హని చేయగలవా?’ అంటూ నిజ జీవితంలో కూడా ఎందరో తెలుసుకోవాలనుకునే ఆసక్తికర విషయాలను అవసరాల శ్రీనివాస్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమైంది. చాలా కాలంగా ఎవరూ నివసించని ఒక ఇంటిలోకి హీరో శ్రీరామ్ కుటుంబం వస్తుంది. ఆ ఇంట్లో వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఆత్మ ఆ కుటుంబానికి నిద్ర కూడా లేకుండా, ప్రాణ భయంతో వణికిపోయేలా చేస్తుంది. అలాంటి సమయంలో వారికి సాయం చేయడానికి వచ్చిన ఈశ్వరీ రావు ‘మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు’ అని చెప్పడం మరింత ఉత్కంఠగా మారింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ ఆత్మల కథ ఏంటి? వాటి నుంచి శ్రీరామ్ కుటుంబాన్ని ఈశ్వరీ రావు రక్షించిందా? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ ట్రైలర్ నడిచింది. (Pindam Movie Trailer Talk)


avasarala.jpg

ఇక ప్రారంభంలో అవసరాల శ్రీనివాస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం అన్నట్లుగా.. ‘ఒక వస్తువుని తగలబెట్టినా, నరికినా, పూడ్చినా అది అంతమైపోతుందని మనం భ్రమపడతాం. కానీ ఆ వస్తువులోని అంతర్గత శక్తిని, ఆ ఎనర్జీని మనం ఎప్పటికీ నిర్మూలించలేం. ఇది శాశ్వత సత్యం’ అని ఈశ్వరీ రావు చెప్పిన మాటతో ట్రైలర్‌ను ముగించిన తీరు ఆకట్టుకుంది. ట్రైలర్‌లో కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కానీ హారర్ చిత్రానికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే థియేటర్‌లో ప్రేక్షకులు అసలైన హారర్ అనుభూతిని పొందడం ఖాయమనిపిస్తోంది. ఈ ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపవుతున్నాయి. ఇది యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ అని, ఇంతటి భయానక హారర్ చిత్రాన్ని టాలీవుడ్ ఇంతవరకూ చూడలేదని చిత్ర బృందం చెబుతోంది. పిండం కథ ప్రస్తుతం అలాగే 1990 మరియు 1930 లలో.. ఇలా మూడు కాలక్రమాలలో జరుగుతుంది. స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనుందని మేకర్స్ చెబుతున్నారు. (Pindam Movie Trailer Out)


ఇవి కూడా చదవండి:

====================

*Harish Shankar: నా అపోహని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేసినందుకు..

*******************************

*Pushpa Keshava: ‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?

***************************************

*Dunki Drop 4 vs Salaar: ‘సలార్’కి పోటీగా ‘డంకీ’.. పోటాపోటీగా ట్రైలర్స్

*******************************************

Updated Date - 2023-12-07T13:35:46+05:30 IST