Harish Shankar: నా అపోహని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేసినందుకు..

ABN , First Publish Date - 2023-12-07T12:11:10+05:30 IST

తెలుగు దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన సినిమా ‘యానిమల్’. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా తన రివ్యూని ఇచ్చారు.

Harish Shankar: నా అపోహని ఇంటర్వెల్‌లో వాడిన గన్‌తో పేల్చేసినందుకు..
Harish Shankar

తెలుగు దర్శకుడు సందీప్ వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటించిన సినిమా ‘యానిమల్’. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించింది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన వారంతా సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హరీష్ శంకర్ (Harish Shankar) ట్విట్టర్ వేదికగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాస్త ఆలస్యమైందని తెలుసు కానీ.. ఈ సినిమా గురించి చాలా క్లారిటీగా నా అభిప్రాయం చెబుతానంటూ హరీష్ ఓ లేఖను తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేశారు. అందులో.. (Harish Shankar Review on Animal)

‘‘బావుందంటే.. బాగోదేమో..

యానిమల్ చూసిన కొంతమంది అనుకుంటున్న మాటలివి. నచ్చిన వాళ్ళు మాత్రం బావుంది అని అనడం లేదు.. బద్దలైపోయింది అంటున్నారు. సినిమాకు రూల్స్ ఏం లేవండి.. అని అందరూ అంటుంటారు. అతను మాత్రం అనకుండా బ్రేక్ చేసి చూపించాడు. Even though I have concerns about second Half, I don’t think it would matter now. అసలు ఈ వాక్యం రాస్తున్నప్పుడే నేనెంత naive అనే feeling వస్తుంది. Because you can argue with content, but not with success.


Harish.jpg

సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే కంటే సినిమా గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళందరూ ఒకటికి రెండుసార్లు చూశారు. అతని పేరులోనే వంగా అని ఉన్నప్పుడు విమర్శలకూ, విశ్లేషణలకు అతను వంగుతాడనుకోవడం అమాయకత్వం. ఎవరి విషయం ఎలా ఉన్నా.. ఎక్కువ length ఉంటే repeat audience రారేమో అన్న నా అపోహని సందీప్ తన Interval‌లో వాడిన gun తో పేల్చేసినందుకు తనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ... ఇంతరాశాక నేను సినిమా...

బాలేదంటే.. బాగోదేమో...’’ అని హరీష్ శంకర్ లేఖలో పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో రష్మికను కలిసి అభినందించిన వీడియోని కూడా హరీష్ షేర్ చేశారు.


ఇవి కూడా చదవండి:

====================

*Pushpa Keshava: ‘పుష్ప’ నటుడు జగదీశ్ అరెస్ట్.. అసలు విషయం ఏంటంటే..?

***************************************

*Dunki Drop 4 vs Salaar: ‘సలార్’కి పోటీగా ‘డంకీ’.. పోటాపోటీగా ట్రైలర్స్

*******************************************

*Naa Saami Ranga: నాగ్ ఎత్తికెళ్లిపోతాడంట.. జర జాగ్రత్త!

********************************

Updated Date - 2023-12-07T12:11:11+05:30 IST