సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sharwanand: సినీ ప్రస్థానాన్ని తలుచుకుంటూ భావోద్వేగపూరిత లేఖ

ABN, First Publish Date - 2023-03-06T16:38:08+05:30

కంటెంట్ బేస్‌డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand). చిరంజీవితో చిన్నతనంలోనే ‘థమ్స్ అప్’ (Thums Up) యాడ్ చేశాడు. ఐదో తారీఖు (Aidho Tareekhu) సినిమాతో హీరోగా మారాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంటెంట్ బేస్‌డ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand). చిరంజీవితో చిన్నతనంలోనే ‘థమ్స్ అప్’ (Thums Up) యాడ్ చేశాడు. ఐదో తారీఖు (Aidho Tareekhu) సినిమాతో హీరోగా మారాడు. శర్వా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అందరికి ధన్యవాదాలు చెబుతూ భావోద్వేగపూరితంగా స్పందించాడు. ఓ లేఖను అభిమానులతో పంచుకున్నాడు.

20ఏళ్ల అద్భుతమైన ప్రయాణం, ప్రపంచమే సినిమా అని శర్వానంద్ తెలిపాడు. ఈ ప్రయాణంలో ప్రతి క్షణాన్ని అస్వాదించానని చెప్పాడు. అందరికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘‘20ఏళ్లుగా ఎన్నో పాత్రలు చేస్తూ, వెండితెరపై అందర్ని అలరిస్తున్నాను. భావోద్వేగాలతో నిండిన ఈ 20ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు, భావోద్వేగాలు చూశాను. కష్ట, నష్టాల్లో నాకు అండగా నిలిచి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ 20ఏళ్ల జీవిత ప్రయాణం ఎంతో అద్భుతంగా కొనసాగింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది. 20ఏళ్ల క్రితం ఈ ప్రయాణానికి ‘శ్రీకారం’ చుట్టాను. ఈ ‘ఒకే ఒక జీవితం’ సినిమాకే అంకితం. ఈ సిని ‘ప్రస్థానం’ మరపురానిది. నాపై మరింత బాధ్యతను పెంచింది. అయినప్పటికీ ‘గమ్యం’ సుదూరంలో ఉంది. మరింత కష్టపడి మిమ్మల్ని అలరించడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేయడానికి ‘రన్ రాజా రన్’ లా పూర్తిస్థాయిలో కృషి చేస్తూనే ఉంటాను. ‘శతమానం భవతి’ అంటూ మీరు ఇచ్చే ఆశీస్సులతో ఇది సాధ్యమవుతుందని నేను నమ్ముతున్నాను’’ అని శర్వానంద్ తెలిపారు. ఇక శర్వానంద్ కెరీర్ విషయానికి వస్తే.. చివరగా ‘ఒకే ఒక జీవితం’ లో నటించారు. ఈ సినిమా అభిమానుల మెప్పుతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య‌తో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

^^^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Krithi Shetty: స్టార్ హీరో చిత్రం నుంచి కృతిని తప్పించిన డైరెక్టర్.. హీరోయిన్‌‌ ఛాన్స్ ఎవరికంటే..?

Taraka Ratna : తారకరత్న లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి.. తీవ్ర భావోద్వేగానికి లోనైన అలేఖ్యారెడ్డి.. కొంచెం కష్టమే కానీ...!

Sushmita Sen: బాలీవుడ్ నటి, మాజీ విశ్వ సుందరికి గుండె పోటు

Upasana: డెలివరీ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఉపాసన కామినేని

RRR: ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్‌లతో పోటీ పడుతున్న రామ్ చరణ్, తారక్

Updated Date - 2023-03-06T16:38:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!