సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?

ABN, First Publish Date - 2023-05-28T15:04:38+05:30

యంగ్ హీరో శర్వానంద్‌కు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డ ప్రమాదం జరిగిందనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం నిజమే కానీ.. తనకేం కాలేదని, అభిమానులు ఆందోళన చెందవద్దని శర్వానంద్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Sharwanand
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యంగ్ హీరో శర్వానంద్ (Sharwanand).. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద రోడ్డ ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న రేంజ్‌ రోవర్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా కొట్టడంతో.. ఆయనకు స్వల్ప గాయాలు (Injuries) అయినట్లుగా వస్తున్న వార్తలపై తాజాగా శర్వానంద్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. రోడ్డు ప్రమాదం జరిగింది నిజమే కానీ.. అది చాలా చిన్న సంఘటనగా ఆయన చెప్పుకొచ్చారు. తనకేం కాలేదని.. అభిమానులెవరూ ఆందోళన చెందవద్దని శర్వానంద్ తెలియజేశారు.

‘‘ఈ ఉదయం నా కారు ప్రమాదానికి గురైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది చాలా చిన్న సంఘటన. మీ అందరి ప్రేమ మరియు ఆశీస్సులతో.. నేను ఇంట్లో సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నాను. దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దు. నాపై ఇంత ప్రేమ చూపిస్తున్న అందరికీ ధన్యవాదాలు. అందరికీ ఈ ఆదివారం గొప్పగా ఉండాలని భావిస్తున్నాను’’ అని శర్వానంద్ తన ట్వీట్‌లో (Sharwanand Tweet) పేర్కొన్నారు. దీంతో ఆయన అభిమానులు (Fans) టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

జూన్ మొదటివారంలోనే శర్వానంద్ పెళ్లి

రీసెంట్‌గా శర్వానంద్ మ్యారేజ్‌ (Sharwanand Marriage)పై ఏ రకంగా వార్తలు వైరల్ అయ్యాయో తెలియంది కాదు. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం పూర్తి చేసుకున్న శర్వానంద్.. ఇంకా పెళ్లిపీటలు ఎక్కకపోవడంతో రకరకాలుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో జూన్ 2, 3 తేదీలలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా శర్వా పెళ్లి జరగబోతున్నట్లుగా అధికారికంగా శర్వా టీమ్ వార్తని విడుదల చేసింది. రాజస్థాన్‌లోని లీలా ప్యాలెస్‌లో శర్వానంద్ పెళ్లికి సంబంధించి ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డి (Rakshita Reddy)ని శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నారు.


ఇవి కూడా చదవండి:

************************************************

*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు

*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..

*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!

*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!

Updated Date - 2023-05-28T15:04:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!