AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం

ABN , Publish Date - Dec 23 , 2023 | 08:01 PM

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ నుండి.. ప్రొడక్షన్ నెం.1 మూవీ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం ప్రారంభం
RK Cinema and AA Creations Film Opening

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ నుండి.. ప్రొడక్షన్ నెం.1 మూవీ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర పూజా కార్యక్రమాల్లో చిత్రయూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల, రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


AA-Creations.jpg

జగన్ చావలి సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఏకధాటిగా చిత్రీకరణను జరపాలని ప్లాన్ చేసినట్లుగా మేకర్స్ తెలిపారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

***************************

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 23 , 2023 | 08:01 PM