RaviTeja: రావణాసుర మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ !

ABN , First Publish Date - 2023-04-08T14:20:26+05:30 IST

రవితేజ సినిమా 'రావణాసుర' విడుదల అయింది. సుధీర్ వర్మ దీనికి దర్శకుడు, ఈ సినిమా మీద రవితేజ కి ఎంత నమ్మకం అంటే, అందుకే ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. మరి ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా వున్నాయి అంటే...

RaviTeja: రావణాసుర మొదటి రోజు షాకింగ్ కలెక్షన్స్ !

రవితేజ (Ravi Teja) నటించిన 'రావణాసుర' (Ravanasura) నిన్న శుక్రవారం విడుదల అయింది. ఈ సినిమాకి ప్రతి దగ్గరా టాక్ అయితే అటు ఇటుగా (Mixed Talk) వచ్చింది. సుధీర్ వర్మ (Sudheer Varma) దీనికి దర్శకుడు. క్రిటిక్స్ కూడా ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. కానీ మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే మాత్రం పరవాలేదు అనిపించింది. అయితే రవితేజ ముందు సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఈ 'రావణాసుర' (#RavanasuraCollections) కలెక్షన్స్ చూస్తే కనక, రవితేజ (RaviTejaRavanasura) కి ఇంకా బాక్స్ ఆఫీస్ (BoxOffice) దగ్గర బాగా పట్టు వుంది అని అర్థం అవుతోంది. కలెక్షన్స్ లో కొంచెం అటు ఇటు తేడా వున్నా, మొదటి రోజు బాగానే రెవిన్యూ వచ్చింది అని చెప్పాలి. అయితే అది ఆలా కొనసాగుతుందో లేదో చూడాలి.

ravanasura3.jpg

ఇంతకు ముందు విడుదల అయిన 'ధమాకా' (Dhamaka) సినిమా రూ.4.66 కోట్లు కలెక్టు చేస్తే, మరి 'రావణాసుర' (#RavanasuraCollection) ఎంత కలెక్టు చేసిందో తెలుసా, ఇది మొదటి రోజు రూ.4.22 కోట్లు షేర్ కలెక్టు చేసింది. ఒక విధంగా చెప్పాలంటే ఇది రవితేజ సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చింది అని చెప్పొచ్చు. నైజాం ఏరియాలో (NizamArea) అత్యధికంగా రూ.1.60 కోట్లు కలెక్టు చేస్తే, సీడెడ్ లో 70 లక్షలు కలెక్టు చేసింది. ఉత్తరాంధ్ర 61 లక్షలు, అలాగే గుంటూరు 45 లక్షలు కలెక్టు చేసింది. ఇంకా వెస్ట్, కృష్ణ, నెల్లూరు వరసగా 21, 22, 15 లక్షలు కలెక్టు చేసింది. ఇది ఒక్క ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలెక్టు చేసిన వసూళ్లు.

Ravanasura.jpg

మొదటి రోజు అత్యధికంగా కలెక్టు చేసిన రవి తేజ సినిమా ఏది అంటే 'క్రాక్' (Krack). ఈ సినిమా మొదటి రోజు ఇంచుముంచి రూ.6 కోట్లకు పనిగా కలెక్టు చేసింది.

ఇది కూడా చదవండి:

Ravanasura film review: రవితేజ రివెంజ్ డ్రామా ఎలా ఉందంటే...

Updated Date - 2023-04-08T14:20:27+05:30 IST