Raj Dasireddy: ద్విభాషా చిత్రానికి సిద్ధమవుతోన్న ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ హీరో!

ABN , First Publish Date - 2023-10-23T19:49:50+05:30 IST

దర్శకుడు మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ సినిమాతో హీరోగా పరిచయమైన యువ హీరో రాజ్ దాసిరెడ్డి.. ఇప్పుడు ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఊటీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం కోసం ప్రస్తుతం ఊటీలో ఇప్పటివరకు షూటింగ్ చేయని అత్యద్భుత లోకేషన్లు అన్వేషిస్తున్నారు

Raj Dasireddy: ద్విభాషా చిత్రానికి సిద్ధమవుతోన్న ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ హీరో!
Raj Dasireddy

దర్శకుడు మారుతి (Director Maruthi) దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ (Bhadram Be Careful Brother) సినిమాతో హీరోగా పరిచయమైన యువ హీరో రాజ్ దాసిరెడ్డి (Raj Dasireddy).. ఇప్పుడు ఓ ద్విభాషా చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఊటీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందే ఈ విభిన్న ప్రేమ కథా చిత్రం కోసం ప్రస్తుతం ఊటీ (Ooty)లో ఇప్పటివరకు షూటింగ్ చేయని అత్యద్భుత లోకేషన్లు అన్వేషిస్తున్నారు.

‘భద్రం బి కేర్‌ఫుల్ బ్రదరూ’ సినిమా అనంతరం రాజ్ దాసిరెడ్డికి తెలుగులో పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ.. అదే సమయంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడంతో తెలుగు అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోయాడట. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటూ అమెరికాలోని న్యూయార్క్‌లో ఉండిపోవాల్సి వచ్చిందని.. అయితే విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తెరకెక్కనున్న సదరు ప్రాజెక్ట్ సెట్స్‌కి వెళ్లేందుకు మరింత సమయం పడుతుండడంతో ఈలోపు ఓ ద్విభాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా రాజ్ దాసిరెడ్డి చెప్పుకొచ్చారు. (Raj Dasireddy Next Film Update)


raj.jpg

ప్రస్తుతం ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, అతి త్వరలోనే సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటు పూర్తి వివరాలు తెలియజేస్తామని రాజ్ దాసిరెడ్డి తెలిపారు. ఈ సినిమా తన కెరీర్‌లో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Dussehra: ఉపాస‌న - రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూశారా?

************************************

*Shalini Pandey: ‘అర్జున్ రెడ్డి’ భామకు ఆ తరహా పాత్రలు చేయాలనుందట..

************************************

*Prabhas: శత శతమానం భవతి.. ‘కన్నప్ప’ టీమ్ ‌గ్రాండ్‌గా విషెస్

****************************************

*Dhanraj: దర్శకుడిగా ధనరాజ్.. స్టార్ యాక్టర్‌తో సినిమా ప్రారంభం

*****************************************

Updated Date - 2023-10-23T20:49:24+05:30 IST