సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

ABN, First Publish Date - 2023-03-24T20:12:44+05:30

బాలీవుడ్ బాడా ప్రొడ్యూసర్స్‌లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. టీ-సిరీస్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. మిడ్ సైజ్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ ప్రాజెక్టులను నిర్మిస్తారని ఆయనకు పేరుంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ (Kabir Singh) ని నిర్మించింది ఆయనే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ బాడా ప్రొడ్యూసర్స్‌లో భూషణ్ కుమార్ (Bhushan Kumar) ఒకరు. టీ-సిరీస్ అనే సొంత నిర్మాణ సంస్థ ఉంది. మిడ్ సైజ్ సినిమాలతో పాటు భారీ బడ్జెట్ ప్రాజెక్టులను నిర్మిస్తారని ఆయనకు పేరుంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ (Kabir Singh) ని నిర్మించింది ఆయనే. ‘ఆదిపురుష్’ (Adipurush) కు కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్‌ (Allu Arjun)లతో కూడా ప్రాజెక్టులను ప్రకటించారు. ఈ రెండు సినిమాలను సందీప్ రెడ్డి వంగనే తెరకెక్కిస్తారు. భూషణ్ అతి త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) తో సినిమా చేయనున్నట్టు రూమర్స్ హల్‌చల్ చేస్తున్నాయి. ‘ఎన్టీఆర్ 30’ పూజా కార్యక్రమానికి ఆయన హాజరుకావడంతో ఈ వదంతులకు మరింత బలం చేకూరినట్లైంది. ప్రస్తుతం తారక్, భూషణ్ కుమార్ మధ్య చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ చర్చలు కనుక సఫలం అయితే అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు‌న్నాయి. కొరటాల శివ సినిమా పూజా కార్యక్రమం ఈ మధ్యనే జరిగింది. ఈ ప్రాజెక్టు వర్కింగ్ టైటిల్‌గా ‘ఎన్టీఆర్ 30’ అని వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల అనంతరమే భూషణ్‌తో మూవీ ఉండనుందని సమాచారం. ‘ఎన్టీఆర్ 30’ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది.

భూషణ్ కుమార్ ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులతో పాటు బాలీవుడ్ హీరోలు రణ్ బీర్ కపూర్, వరుణ్ ధావన్, కార్తిక్ ఆర్యన్ తదితరులతో సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. భూషణ్ ఈ మధ్యనే ‘షెహజాదా’ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది.

^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-24T20:12:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!