O Saathiya: చిన్న సినిమా.. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధం

ABN , First Publish Date - 2023-06-23T22:11:00+05:30 IST

ఆర్యన్‌గౌరా, మిస్టీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించిన చిత్రం ‘ఓ సాథియా’. ఈ సినిమాతో దివ్య భావన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో UFO మూవీస్ వారు ఈ సినిమాని భారీగా విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా నిర్మాతలు ప్రకటించారు.

O Saathiya: చిన్న సినిమా.. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధం
O Saathiya Movie Still

ప్రేమ కథల్లో కొత్త కోణం తీసుకొని నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సరికొత్త ప్రేమకథగా రూపొందించిన చిత్రం ‘ఓ సాథియా’ (O Saathiya). ఆర్యన్‌గౌరా (Aryan Gowra), మిస్టీ చక్రవర్తి (Mishti Chakravarty) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తన్వికా–జశ్వికా క్రియేషన్స్‌ పతాకంపై చందన కట్టా, సుభాష్‌ కట్టా నిర్మించారు. ఈ సినిమాతో దివ్య భావన (Divya Bhavana) దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని జూలై 7న పాన్‌ ఇండియా లెవెల్‌లో భారీగా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ తాజాగా ప్రకటించారు. (O Saathiya Movie)

ఈ సందర్భంగా నిర్మాత సుభాష్‌ (Subhash) మాట్లాడుతూ.. చిన్న సినిమా అయినా పెద్ద బ్యాక్‌అప్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా విడుదల కావడానికి ముఖ్య కారణం UFO మూవీస్ సంస్థకు చెందిన ఏ.పి, తెలంగాణ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.లక్ష్మణ్‌. ఆయన ‘ఓ సాథియా’ సినిమా చూసి హీరో హీరోయిన్ బాగా చేశారని, మూవీ డైరెక్షన్ బాగుందని అన్నారు. ఈ సినిమాకి పాటలు బ్యాక్ బోన్ అని, ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేము సపోర్ట్ చేస్తామని ఆయన ముందుకొచ్చారు. దీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో జూన్ 7న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని తెలిపారు.

UFO-Movies.jpg

కంటెంటే బలంగా వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుందని నమ్ముతున్నట్లుగా చెప్పిన నిర్మాత సుభాష్.. తమ ఓ సాథియా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నందుకు‌గానూ UFO మూవీస్ వారికి స్పెషల్ థాంక్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*KP Chowdary: ‘కబాలి’ నిర్మాత కస్టడీ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. చిక్కుల్లో అషు రెడ్డి


**************************************

*BoyapatiRAPO: మరింత దగ్గరకి మాస్ బీభత్సం.. ఈ మధ్య కాలంలో ఇలాంటి అనౌన్స్‌మెంట్ అయితే రాలే..


**************************************

*Sreeleela: దేవాలయం కంటే గొప్పది.. ఆ విషయం బాలయ్యకి కూడా తెలియదు.


**************************************

*Spy Trailer Talk: స్వాతంత్య్రం అంటే ఒకడు ఇచ్చేది కాదు, లాక్కునేది. ఇదెవరు చెప్పారో తెలుసా?


**************************************

Updated Date - 2023-06-23T22:14:06+05:30 IST