NaniVsNikhil: నిఖిల్ ని దాటలేకపోయిన నాని

ABN , First Publish Date - 2023-04-08T15:11:28+05:30 IST

నిఖిల్, నాని ఇద్దరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఈమధ్య విడుదల అయినా నాని సినిమా 'దసరా' ఒక్క తెలుగులోనే బాగా ఆడింది, మరి మిగతా ఏరియాల్లో ఆడలేదు. నిఖిల్ 'కార్తికేయ 2' హిందీలో కూడా పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉందంటే...

NaniVsNikhil: నిఖిల్ ని దాటలేకపోయిన నాని
Nani and Nikhil

ఇప్పుడు పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ప్రతి నటుడు పాన్ ఇండియా కథలు కావాలని అంటున్నారని, ఆలా అయితేనే చేస్తామని కూర్చున్నారని పరిశ్రమలో అంటున్నారు. అడివి శేష్(Adivi Sesh), నిఖిల్ (Nikhil Siddharth), నాని (Nani), నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఒకరేంటి ఇప్పుడున్న యువ నటులంతా కూడా పాన్ ఇండియా కథలు అయితే చేస్తున్నారని ఒక వార్త నడుస్తోంది. అయితే మొన్న ఈమధ్య విడుదల అయిన నాని సినిమా 'దసరా' (#Dasara) కూడా నాని పాన్ ఇండియా (PanIndiaCinema) సినిమా అనే చాలా ప్రచారం చేసాడు. నార్త్ లో చాలా నగరాలూ తిరిగి ఆ సినిమా గురించి చాలా ప్రచారం చేసాడు, కానీ ఆ సినిమా తెలంగాణాలో (Telangana) తప్ప వేరే దగ్గర అంచనాలకు తగ్గట్టుగా నడవలేదు.

Dasara.jpg

అయితే 'దసరా' (#Dasara) అన్ని భాషల్లోనే ఒకేసారి విడుదల చేశారు. దీనికన్నా ముందు నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Sidhdarth) నటించిన 'కార్తికేయ 2' (#Karthikeya2) తెలుగులో ముందు విడుదల అయి మంచి విజయం సాధించింది. ఆ తరువాత అదే సినిమాని హిందీ లో విడుదల చేస్తే అక్కడ కూడా బ్రహ్మాండంగా నడించింది. నిఖిల్ కి మొదటి వందకోట్ల (100 crore club) సినిమా గా నమోదయింది. మరి నాని సినిమా 'దసరా' (#Dasara) వందకోట్లు వసూల్ చెయ్యకుండానే వందకోట్ల క్లబ్ లోకి చేరిందని వేసుకున్నారని ఒక వార్త ప్రచారం అయింది. అందులో నిజా నిజాలు నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే తెలియాలి.

Nikhil.jpg

అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, నాని కన్నా నిఖిల్ చాలా ముందున్నాడు. ఎందుకంటే నిఖిల్ 'కార్తికేయ 2' పాన్ ఇండియా లెవెల్ లో విజయం సాధించటమే కాకుండా, రెవిన్యూ కూడా బాగా రాబట్టింది. ఇప్పుడు నిఖిల్ రాబోయే సినిమా 'స్పై' (SPY) కూడా పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. ఆ సినిమా విడుదల కాకముందే నాన్ థియేట్రికల్ హక్కులు అప్పుడే రూ.40 కోట్లకు (Rs 40 crore) అమెజాన్ కి (Amazon) అమ్మేశారు.

nikhilspy.jpg

అంటే నిఖిల్ 'స్పై' కి అంత డిమాండ్ ఉందన్నమాట. ఆ సినిమా కూడా చాలా గ్రాండ్ గా తీస్తున్నారు అని కూడా వినికిడి. ఇవన్నీ చూస్తుంటే నాని కన్నా నిఖిల్ చాలా ముందు వున్నాడు అని అర్థం అవుతోంది. అదీ కాకుండా ఇద్దరికీ ఇప్పుడు ప్రొఫెషనల్ గా మంచి పోటీ వచ్చింది అని కూడా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ఇది కూడా చదవండి:

Meter film review: ఈ మీటర్ పాతది, అందుకే పని చెయ్యలేదు

Pushpa2TheRule: అల్లు అర్జున్ పుట్టినరోజుకి డేవిడ్ వార్నర్ షాకింగ్ ఇచ్చాడుగా!

Updated Date - 2023-04-08T15:11:30+05:30 IST