Pushpa2TheRule: అల్లు అర్జున్ పుట్టినరోజుకి డేవిడ్ వార్నర్ షాకింగ్ ఇచ్చాడుగా!

ABN , First Publish Date - 2023-04-08T13:34:58+05:30 IST

అల్లు అర్జున్ పుట్టినరోజునాడు అభిమానులు అందరూ అతనికి శుభాకాంక్షురాలు చెపుతారు, సంబరాలు చేసుకుంటారు. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఇలా వెరైటీ గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. అదెలా అంటే...

Pushpa2TheRule: అల్లు అర్జున్ పుట్టినరోజుకి డేవిడ్ వార్నర్ షాకింగ్ ఇచ్చాడుగా!

అల్లు అర్జున్ (Allu Arjun) ఇమేజ్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఒక్క సినిమా ప్రేక్షకులే కాదు, అతని అభిమానులే కాకుండా, అంతర్జాతీయ క్రికెటర్స్ (International cricketers) కూడా అతనికి అభిమానులు అయిపోయారు. అందులో ఒకడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner). ఇతనికి భారతదేశంతో మంచి అనుబంధం వుంది. ఎందుకంటే అతని దేశం తరుపున క్రికెట్ ఆడటానికి ఇండియా వచ్చినప్పుడు, అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IndianPremiereLeague) లో ఆడుతున్నప్పుడు డేవిడ్ వార్నర్ భారతదేశం (#DavidWarner) తో అనుబంధాన్ని బాగా పెంచుకున్నాడు.

davidwarner1.jpg

అందుకే భారతీయ పండగలప్పుడు కూడా మన దేశం ప్రజలకి శుభాకాంక్షలు చెపుతూ ఉంటాడు. ఈమధ్య జరిగిన శ్రీరామానవమి పండగకి శుభాకాంక్షలు చెప్పాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, డేవిడ్ వార్నర్ ఎన్నో భారతీయ, (#WhereisPushpa)ముఖ్యంగా ఎక్కువ తెలుగు పాటలకు (Telugu Songs) బాగా రీల్స్ (Reels) చేసి పోస్ట్ చేసాడు. వాటికి మంచి ఆదరణ లభించింది కూడా. (IPL) అలాగే డేవిడ్ వార్నర్ కి 'పుష్ప' (Pushpa) సినిమా చూసాక ఆ సినిమా లోని పాటలు, అందులో అల్లు అర్జున్ (#AlluArjun) చేసిన మేనరిజం అవన్నీ కూడా రీల్స్ గా చేసి పోస్ట్ చేసాడు. వాటన్నిటికీ (HBDAlluArjun) కూడా మంచి ఆదరణ వచ్చింది. ఆ తరువాత అతను అల్లు అర్జున్ అభిమానిలా మారిపోయాడు కూడా.

ఈరోజు అంటే ఏప్రిల్ 8, అల్లు అర్జున్ పుట్టినరోజు. (#HappyBirthdayAlluArjun) అయితే ఈరోజు డేవిడ్ వార్నర్ (David Warner) చేసిన విషెస్ వింటే షాక్ అవుతారు. అతను అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, అతని కూతురు కూడా హ్యాపీ బర్త్ డే పుష్ప (HappyBirthdayPushpa) అని చెప్పింది. అది ఇంకా షాక్. (Pushpa2TheRule) ఇలా ఒక తెలుగు నటుడికి ఒక అంతర్జాతీయ క్రికెట్, ఆస్ట్రేలియా కి చెందిన వాడు ఇలా కుటుంబంతో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం ఇది మొదటి సారెమో. అదీ కాకుండా 'పుష్ప 2' (Pushpa 2) కోసం వెయిట్ చేస్తున్నాం అని కూడా చెప్పాడు డేవిడ్ వార్నర్.

Updated Date - 2023-04-08T13:42:18+05:30 IST