Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్

ABN , First Publish Date - 2023-11-24T16:51:32+05:30 IST

బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్‌లో రీసెంట్‌గా ‘టైగర్ 3’ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ బ్యానర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ‘అక్క’ అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోంది. వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్, రాధికా ఆప్టే ఇందులో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

Akka: కీర్తి సురేష్, రాధికా ఆప్టేలతో రహస్యంగా YRF వెబ్ సిరీస్
Keerthy Suresh and Radhika Apte

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో భారీ సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ యష్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films). ఇటీవలే ఈ బ్యానర్‌ నుంచి ‘టైగర్ 3’ చిత్రం విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ బ్యానర్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది. సీట్ ఎడ్జ్ రివేంజ్ థ్రిల్లర్ జోనర్‌లో పీరియాడిక్ థ్రిల్లర్‌గా ‘అక్క’ (Akka) అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించబోతోంది. చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తోన్న వెర్సటైల్ యాక్టర్స్ కీర్తి సురేష్ (Keerthy Suresh), రాధికా ఆప్టే (Radhika Apte) ఇందులో ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.

సహజ సిద్ధమైన నటనతో మెప్పించే హీరోయిన్లలో కీర్తి సురేష్, రాధికా ఆప్టే పేర్లు కూడా మొదటి వరుసలో ఉంటాయి. పాత్ర ఏదైనా.. పోటాపోటీగా నటించే వీరిద్దరూ కలిసి ‘అక్క’ అనే ప్రాజెక్ట్‌లో చేస్తుండటంతో సహజంగానే ఈ సిరీస్‌పై అంచనాలు మొదలయ్యాయి. ఆదిత్య చోప్రా నిర్మాతగా ధర్మరాజ్ శెట్టి అనే డెబ్యూ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. ‘అక్క’ ప్రాజెక్ట్‌పై డైరెక్టర్ విజన్‌ని గుర్తించిన ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను మేకర్స్ ప్రస్తుతానికైతే రహస్యంగానే ఉంచుతున్నారు. ఎటువంటి విషయం రివీల్ చేయడం లేదు. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘ది రైల్వే మెన్’ వెబ్ సిరీస్‌ను వైఆర్‌ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ తమ మొదటి వెబ్ సిరీస్‌గా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో ఆర్. మాధవన్, కె.కె.మీనన్, దివ్యేందు శర్మ, బాబిల్ ఖాన్ తదితరులు నటించారు. 1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఆధారంగా దీన్ని తెరకెక్కించి రిలీజ్ చేయగా వరల్డ్ వైడ్ టాప్ టెన్ వెబ్ సిరీస్‌ల్లో ఒకటిగా నెట్‌ఫ్లిక్స్‌లో ఇది ట్రెండ్ అవుతుంది. (Akka Web Series)


Akka-Web-Series.jpg

అలాగే వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన సెకండ్ వెబ్ సిరీస్ ‘మండల మర్డర్స్’. ఇది మల్టీ సీజన్ సిరీస్. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వాణీ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో ఆమె నటనకు చాలా మంచి ప్రశంసలు దక్కాయి. ఇదే ఆమె తొలి డిజిటల్ ఎంట్రీ. వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, జమీల్ ఖాన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఒకవైపు భారీ సినిమాలు, మరో వైపు వైవిధ్యమైన కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు రూపొందించటానికి వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ పక్కా ప్లాన్డ్‌గా దూసుకెళుతోంది. (Keerthy Suresh and Radhika Apte)


ఇవి కూడా చదవండి:

====================

*Chandra Mohan: నాన్న ఎప్పుడూ ఏం చెప్పేవారంటే.. - చంద్రమోహన్ కుమార్తె

*******************************

*Director Teja Marni: కథలు రాయలేక కాదు.. కథలు లేక కాదు.. రీమేక్స్ చేసేది అందుకే!

****************************

Updated Date - 2023-11-24T16:51:34+05:30 IST