Keerthy Suresh: ‘మహానటి’ లో నటించినందుకు నా పై ట్రోల్స్

ABN , First Publish Date - 2023-03-24T20:44:57+05:30 IST

కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఆమె తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.

Keerthy Suresh: ‘మహానటి’ లో నటించినందుకు నా పై ట్రోల్స్

కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh). ఆమె తాజాగా నటించిన సినిమా ‘దసరా’ (Dasara). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా ఆసక్తికర కబుర్లను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘మహానటి’ (Mahanati) సినిమా చేసినందుకు తనపై ట్రోల్స్ వచ్చాయని ఆమె తెలిపారు.

‘‘నేను ‘మహానటి’ సినిమాకు మొదట నో చెప్పాను. సావిత్రమ్మ పాత్రలో నటించడానికి చాలా భయపడ్డాను. కానీ, దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. ఈ పాత్రను నువ్వు మాత్రమే చేయగలవని ధైర్యనిచ్చారు. ఆయన నన్ను బాగా నమ్మారు. డైరెక్టరే నమ్ముతున్నప్పుడు నన్ను నేనెందుకు నమ్మకూడదనుకున్నా. అలా ప్రాజెక్ట్‌ పూర్తి చేశా. అయితే, ఆ పాత్రను అంగీకరించినందుకు కొంత మంది నన్ను ట్రోల్‌ చేశారు. ఆ విషయం గురించి నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నప్పుడే ఈ ట్రోల్స్‌ గురించి నాకు తెలిసింది. సోషల్‌మీడియాలో వచ్చే నెగెటివిటీపై నేను ఆసక్తి చూపించను. అందుకే ట్రోల్స్, విమర్శలు నా వరకు రావు. ‘మహానటి’ సినిమా సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా. సావిత్రమ్మకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఆమె బయోపిక్‌లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సవాళ్లు, విమర్శలు ఉన్నప్పటికీ ఆ పాత్ర చేసినందుకు సంతోషంగా ఉన్నా’’ అని కీర్తి సురేశ్‌ తెలిపారు. మంచి కథ వస్తే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తానన్నారు. ‘దసరా’ లో తాను వైవిధ్యమైన పాత్రను పోషించానన్నారు. ఆ పాత్రతో అబ్బాయిలందరు ప్రేమలో పడతారని ఆమె చెప్పారు.

^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Bhushan Kumar: తెలుగు హీరోలను లైన్‌లో పెడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్.. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత తారకేనా..?

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-24T20:47:00+05:30 IST