Plant Man: ‘ప్లాంట్‌ మ్యాన్‌’ నుంచి పాటొచ్చింది

ABN , First Publish Date - 2023-10-21T22:41:16+05:30 IST

‘కాలింగ్‌ బెల్‌, రాక్షసి’ వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ఇప్పుడు నిర్మాతగా మారి ‘ప్లాంట్‌ మ్యాన్‌’ అనే ఒక విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేయగా.. మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ..’ పాటను మేకర్స్ విడుదల చేశారు.

Plant Man: ‘ప్లాంట్‌ మ్యాన్‌’ నుంచి పాటొచ్చింది
Sonali Panigrahi

‘కాలింగ్‌ బెల్‌, రాక్షసి’ వంటి హారర్‌ మూవీస్‌తో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ (Panna Royal) ఇప్పుడు నిర్మాతగా మారి ‘ప్లాంట్‌ మ్యాన్‌’ (Plant Man) అనే ఒక విభిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేయగా.. మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘కన్నమ్మ.. చిట్టి గుండెలోన దాచలేని గోలమ్మ... ఈ పిల్లగాడి అల్లరేంటొ సూడమ్మ.. లవ్‌ సెయ్యమంటే ఎందుకంత బెట్టమ్మా... చెప్పమ్మా’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

డైరెక్టర్‌ పన్నా రాయల్‌ డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ సంస్థను స్థాపించి కొత్తవారిని ప్రోత్సహించాలని, కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించుకుని.. దాని ప్రకారమే ఈ ‘ప్లాంట్‌ మ్యాన్‌’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో కె. సంతోష్‌బాబు (K Santhosh Babu)ను దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పన్నా రాయల్‌ దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదల చేసిన పాటకు ఈశ్వర్‌ హేమకాంత్‌ సాహిత్యం అందించగా రోహిత్‌ శ్రీనివాసన్‌, కుమార వాగ్దేవి ఆలపించారు. ఆనంద బాలాజీ ఈ పాటను స్వర పరిచారు. క్యాచీ ట్యూన్‌తో వచ్చిన ఈ పాట కూడా మంచి స్పందనను రాబట్టుకుంటోంది. (Plant Man Kannamma Lyrical Video Song Out)


Plant-Man-song.jpg

ఈ సందర్భంగా నిర్మాత పన్నా రాయల్‌ మాట్లాడుతూ.. ‘‘కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా చూసి ఎంజాయ్‌ చేయదగ్గ సినిమా ఇది. పిల్లలు, పెద్దవారు ఈ సినిమాని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను నిర్మిస్తున్నాం. ఈ సినిమా ద్వారా సంతోష్‌బాబుని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాం. ఇకపై కూడా మా డిఎం యూనివర్సల్‌ స్టూడియోస్‌ బేనర్‌లో కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇస్తాం. ఇంతకు ముందు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు, ఇప్పుడు విడుదల చేసిన పాటను ఆదరిస్తోన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Poonam Kaur: నేను కూడా ‘జై బాలయ్య’ బ్యాచ్‌లోకి చేరాలనుకుంటున్నా..

********************************************

*Tiger 3: ఆ పాట గురించి కత్రినా ఏంటి అంత స్పెషల్‌గా చెబుతోంది..

*************************************

*Sharathulu Varthisthayi: ఈ సినిమా గురించి త్రివిక్రమ్ ఏమన్నారంటే..? ‘షరతులు వర్తిస్తాయి’!

**************************************

Updated Date - 2023-10-22T11:32:33+05:30 IST