Nachinavadu: ‘కదిలే కాలం ఆగిందే’ పాట విడుదల

ABN , First Publish Date - 2023-08-20T15:55:01+05:30 IST

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం‌పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నచ్చినవాడు’ (Nachinavadu). తాజాగా ఈ చిత్రం నుంచి ‘కదిలే కాలం ఆగిందే’ లిరికల్ సాంగ్‌ విడుదలైంది.

Nachinavadu: ‘కదిలే కాలం ఆగిందే’ పాట విడుదల
Nachinavadu Song Launch

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం‌పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘నచ్చినవాడు’ (Nachinavadu). తాజాగా ఈ చిత్రం నుంచి ‘కదిలే కాలం ఆగిందే’ లిరికల్ సాంగ్‌ విడుదలైంది. ఈ పాటను బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ఎల్ఏ అరికెపూడి గాంధీ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. పాటను వీక్షించిన ఎమ్ఎల్ఏ అరికెపూడి గాంధీ.. పాట చాలా బాగుందని, సినిమా మంచి విజయం సాధించాలని యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరచగా.. జావేద్ అలీ ఆలపించారు. యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి ఈ పాటకు సాహిత్యం అందించారు.


Nachinavadu.jpg

ఈ సందర్భంగా హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ.. ‘నచ్చినవాడు’ సినిమా నుంచి ‘కదిలే కాలం ఆగిందే’ అనే మెలోడీ పాటను బిఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ‌గారి చేతుల మీదుగా.. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేశాం. గాంధీ‌గారికి ఈ పాట ఎంతగానో నచ్చి.. సంగీత దర్శకుడు మెజ్జో జోసెఫ్‌ని కొనియాడారు. సినిమా మంచి విజయం సాధించాలి అని తన శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంతో నిర్మించబడిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Photo.jpg


ఇవి కూడా చదవండి:

***************************************

*Nelson Dilipkumar: ‘జైలర్‌’ సక్సెస్‌కు కారణం ఏమిటంటే..?

***************************************

*Samantha: ‘ఖుషి’ వేడుక ముగియగానే హడావుడిగా అమెరికాకు సమంత.. ఎందుకో తెలుసా?

***************************************

*Cable Reddy: ఈ హీరోకి టైటిల్స్ భలే కుదురుతున్నాయ్..

***************************************

*Udhayanidhi Stalin: ఆ నిర్ణయంలో మార్పులేదు

****************************************

*Brahmanandam: అంగరంగ వైభవంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం రెండో కుమారుడి వివాహం

***************************************

Updated Date - 2023-08-20T16:13:55+05:30 IST