ID: ‘ఐడీ’ చిత్రానికి ఆ అవార్డ్ వస్తే ఆస్కార్ వచ్చినట్లేనట!
ABN , First Publish Date - 2023-05-28T18:14:30+05:30 IST
2020లో వచ్చిన ‘గతం’ చిత్రంతో మంచి విజయంతో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న టీమ్.. ఇప్పుడు మరోమారు ‘ఐడీ’ చిత్రంతో సిద్ధమవుతున్నారు. ఈ ‘ఐడీ’ చిత్రం కూడా విడుదలకు ముందే ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ కూడా ఈ చిత్రాన్ని వరించింది. ఇప్పుడు ఓక్‌విల్లే ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఈ చిత్రాన్ని పంపిస్తున్నట్లుగా మేకర్స్ తెలియజేశారు.
‘గతం’ (Gatham) అనే క్రేజీ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన ట్యాలెంటెడ్ టీం మరోసారి మెరిసింది. 2020లో ‘గతం’ చిత్రాన్ని తెరకెక్కించి ఎన్నో అవార్డులు దక్కించుకున్నారు దర్శకుడు కిరణ్ రెడ్డి కొండమడుగుల (Kiran Reddy Kondamadugula), సంగీత దర్శకుడు సాయిచరణ్ పాకాల (SriCharan Pakala). ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్ ‘ID’ అనే డార్క్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ వేడుకలో సత్తా చాటింది. ఈ చిత్రంలో ‘గతం’ మూవీలో నటించిన భార్గవ పోలుదాసు (Bhargava Poludasu), రాకేష్ (Rakesh) తిరిగి నటించారు. ఈ సినిమా రిలీజ్‌కి ముందే ఏకంగా 37 అవార్డులు గెలుచుకోవడం విశేషం. వీటితోపాటు అనేక అవార్డులకు కూడా ‘ఐడి’ చిత్రం నామినేట్ అయింది.
ఒక రోజు నేను నార్మల్‌గా నిద్ర లేచినప్పుడు.. సమాజంలో నాకు గుర్తింపు లభించనప్పుడు ఏమవుతుంది? అనే ప్రశ్న నుంచి దర్శకుడు ఈ చిత్ర కథ రాసుకున్నారు. ఇదిలా ఉండగా త్వరలో కెనడాలో ఓక్‌విల్లే ఫిలిం ఫెస్టివల్ (Oakville Film Festival) వేడుకలో ఐడీ చిత్ర ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు. అక్కడ ఈ చిత్రం అవార్డు గెలుచుకుంటే అది తమకి ఆస్కార్ (Oscar)తో సమానం అని చిత్రయూనిట్ భావిస్తోంది. ఇప్పటికే 600 ఫిలిం ఫెస్టివల్స్‌లో ఇండియా, ఇతర దేశాల్లో ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుందీ చిత్రం.

ఈ చిత్ర అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చేందుకు ఎక్కడా రాజీ పడకుండా.. ఇండియా నుంచి హాలీవుడ్ నుంచి అద్భుతమైన టెక్నీషియన్స్‌తో పనిచేయించినట్లుగా నిర్మాతలు సుభాష్ రావడ, భార్గవ పోలుదాసు తెలిపారు. హర్ష ప్రతాప్ (Harsha Pratap), సృజన్ యర్రబోలు (Srujan Yarabolu) ఈ చిత్రానికి సహనిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రంలో నిర్మాత భార్గవ పోలుదాసు ‘గతం’ తరహాలోనే ఈ చిత్రంలో కూడా అద్భుతమైన పాత్రలో నటించినట్లుగా ఇప్పటికే ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఆయన పాత్రలో ఊహించని షేడ్స్, మలుపులు ఉంటాయని, ఒక టిపికల్ పాత్రలో ఆయన నటించారనేలా దర్శకుడు కిరణ్ రెడ్డి కూడా తెలిపారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు
*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు
*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది
*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?
*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు
*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..