కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?

ABN, Publish Date - Dec 29 , 2023 | 02:43 PM

బబ్లీ బ్యూటీ హన్సిక మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతోంది. ఆమె హీరోయిన్‌గా రాజు దుస్స దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘105 మినిట్స్’. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను ‘మంగళవారం’ చిత్ర దర్శకుడు అజయ్ భూపతి విడుదల చేశారు. మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉండటంతో పాటు.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.

Hansika in 105 Minutes Movie

బబ్లీ బ్యూటీ హన్సిక (Hansika) ప్రధాన పాత్రలో స్కిన్‌ మాఫియా కథాంశంతో వచ్చిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name is Shruthi). ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ మరో వైవిధ్యభరిత సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు హన్సిక రెడీ అవుతోంది. ఆమె హీరోయిన్‌గా రాజు దుస్స దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘105 మినిట్స్’ (105 Minutes). తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

రుద్రాంశ్ సెల్యులాయిడ్స్, మాంక్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి బొమ్మ కె శివ నిర్మాత (Bomma K Shiva). ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సింగిల్ షాట్ సింగిల్ క్యారెక్టర్ (Single Character) మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మోషన్ పోస్టర్‌లో రక్తపు గాయాలతో కుర్చీలో కూర్చున్న హన్సిక ఒక ఇంటెన్సిఫైడ్ లుక్‌తో కనిపిస్తోంది. ఈ మోషన్ పోస్టర్‌ను ‘మంగళవారం’ డైరెక్టర్ అజయ్ భూపతి (Ajay Bhupathi) చేతుల మీదగా చిత్రయూనిట్ విడుదల చేసింది. శ్యాం సియస్ సంగీతాన్ని అందించారు. ఈ మోషన్ పోస్టర్ మూవీపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.


హన్సిక ఇంతకుముందు ఎన్నడు కనిపించని గెటప్‌లో చాలా కొత్తగా కనిపిస్తోంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్.. అందులోనూ ఇలాంటి ఒక డిఫరెంట్ రోల్ చేయడం హన్సికకి ఇదే మొదటిసారి. మాంక్ మరియు పనోరమ స్టూడియోస్ సంయుక్తంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 26న రిపబ్లిక్ డే స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (105 Minutes Motion Poster Launched)


ఇవి కూడా చదవండి:

====================

*Alphonse Puthren: విజయకాంత్‌‌‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

**************************

*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!

****************************

*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!

*****************************

*Prabhas: ప్రభాస్ సత్తా ఏంటో చూపిన ‘సలార్’.. కేవలం 6 రోజుల్లో ఎన్ని కోట్ల వసూళ్లంటే?

****************************

Updated Date - Dec 29 , 2023 | 02:43 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!