కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jithender Reddy: దర్శకుడు విరించి వర్మ తదుపరి చిత్రమిదే.. టైటిల్ లుక్ విడుదల

ABN, First Publish Date - 2023-09-09T20:39:47+05:30

‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ. ప్రస్తుతం ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ‘జితేందర్ రెడ్డి’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు దేవకట్టా చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Jithender Reddy

‘ఉయ్యాల జంపాల, మజ్ను’ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విరించి వర్మ (Director Virinchi Verma). ప్రస్తుతం ముదుగంటి క్రియేషన్స్ (Muduganti Creations) బ్యానర్‌పై నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy) సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు దేవకట్టా (Deva Katta) విడుదల చేశారు. 1980లో జరిగే ఒక పిరియాడిక్ కథగా రూపొందుతున్న ఈ సినిమా.. తెలంగాణ నేపథ్యంలో రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని నడిచే సీరియస్ యాక్షన్ డ్రామా ఉంటుందని తెలుస్తోంది.

టైటిల్ లుక్ విడుదల చేసిన దేవకట్టా.. కాన్సెప్ట్ అడిగి తెలుసుకుని.. చిత్రయూనిట్‌ని అభినందిస్తూ.. సినిమా మంచి విజయం సాధించాలని కోరారు. కాగా.. డైరెక్టర్ విరించి వర్మ డైరెక్ట్ చేసిన గత రెండు చిత్రాలతో లవ్ స్టోరీస్‌ చేసి ప్రేక్షకుల మెప్పించగా.. ఈ సారి పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా‌తో సిద్ధమవుతున్నారనేది ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. (Jithender Reddy Title Look Poster Out)


ఈ సినిమాలో హీరో ఎవరనేది త్వరలో ప్రకటించబోతున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన ఆర్టిస్టుల వివరాలు, ఫస్ట్ లుక్ త్వరలోనే మీడియాకు తెలియజేస్తామని మేకర్స్ తెలిపారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి.ఎస్.జ్ఞానశేఖర్ ఈ సినిమాకు కెమెరామెన్‌గా వర్క్ చేస్తుండగా.. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. నాగేంద్ర కుమార్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే రానున్నాయి.


ఇవి కూడా చదవండి:

============================

*Anand Deverakonda: ‘బేబీ’ తర్వాత.. ఆనంద్ రూట్ మార్చాడు.. ఈసారి మాస్ బొమ్మతో..

*********************************

*Sky: ఈ ‘స్కై’కి ట్యాగ్‌లైన్ అదిరింది

*********************************

*Gopichand32: గోపీచంద్ 32వ చిత్రం ఆ దర్శకుడితోనే.. ఓపెనింగ్ కూడా పూర్తయింది

*********************************

*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్‌’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో

*********************************

*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్

**********************************

Updated Date - 2023-09-09T20:39:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!