SPY: ఇంత నెగటివ్ టాక్ లోనూ నిఖిల్ సినిమా షాకింగ్ కలెక్షన్స్

ABN , First Publish Date - 2023-06-30T16:02:18+05:30 IST

నిఖిల్ సిద్ధార్థ నటించిన 'స్పై' సినిమా బక్రీద్ పండగ సెలవు దినం నాడు జూన్ 29 న విడుదల అయింది. ఈ సినిమా మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. గ్యారీ దీనికి దర్శకుడు, ఈ సినిమా మొదటి కలెక్షన్స్ ఎలా వున్నాయంటే...

SPY: ఇంత నెగటివ్ టాక్ లోనూ నిఖిల్ సినిమా షాకింగ్ కలెక్షన్స్
Spy film first day Collections

నిఖిల్ సిద్ధార్థ (NikhilSiddharth) నటించిన 'స్పై' #SpyMovie సినిమా నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇది పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్ర నిర్వాహకులు విడుదల చేశారు. అయితే ఈ సినిమా క్రిటిక్స్ కి అంతగా నచ్చలేదు, అలాగే బాగా నెగటివ్ టాక్ కూడా వచ్చింది. ఇంత అయినా కూడా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం అదరగొట్టింది. నిఖిల్ కెరీర్ లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

మామూలుగా శుక్రవారం సినిమాలను విడుదల చేస్తారు, కానీ బక్రీద్ పండగ సెలవు దినం కావటంతో నిఖిల్ సినిమా గురువారం అంటే జూన్ 29 న విడుదల చేశారు. #SpyCollections సెలవు కావటంతో మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాస్ రూ. 11.7 కోట్లు కలెక్టు చేసిందని ఆ సినిమా నిర్మాణ సంస్థ, అలాగే నిఖిల్ తన సాంఘీక మాధ్యమం ద్వారా తెలియచేసారు. అంటే సుమారు రూ. 6 కోట్ల షేర్ వసూలు చేసిందని చెప్పొచ్చు.

Nikhil-Pic.jpg

ఇది నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక మొదటి రోజు కలెక్షన్స్ గా చెప్పవచ్చు. అగ్ర నటులు తరువాత చేస్తున్న రెండో గ్రేడ్ నటుల జాబితాలోకి వచ్చిన నిఖిల్ కలెక్షన్స్ చూస్తే ఈమధ్య కాలంలో మొదటిరోజు ఇలా ఇంత కలెక్షన్స్ చేసే సినిమా ఏదీ లేదనే చెప్పాలి. గ్యారీ బిహెచ్ (Garry Bh) ఈ సినిమాతో దర్శకుడిగా ఆరంగేట్రం చేసాడు. ఈ సినిమాకి కథని నిర్మాత రాజశేఖర్ రెడ్డి అందచేశారు. తేజ ఉప్పలపాటి కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఇంతకు ముందు విడుదల అయిన నిఖిల్ సినిమా 'కార్తికేయ 2' #Karthikeya2 బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమా కన్నా ఎక్కువ కలక్షన్స్ రాబట్టింది, అయితే గురువారం విడుదల అయింది కాబట్టి, ఈ శని, ఆదివారాలు కలెక్షన్స్ ఎలా వుంటాయో చూడాలి. వేరే పెద్ద సినిమా కూడా లేకపోవటం, నిఖిల్ సినిమా కి మంచి ప్లస్ అయిందనే చెప్పాలి.

ఇది కూడా చదవండి:

Spy Film Review: ఈ పాన్ ఇండియా మిషన్ ఫెయిల్ అయింది!

Updated Date - 2023-06-30T16:02:18+05:30 IST