Manoj - Mounika: మనోజ్‌ పోస్ట్‌ వైరల్‌..

ABN , First Publish Date - 2023-06-22T15:06:38+05:30 IST

మంచు మనోజ్‌ భార్య భూమా మౌనిక యోగా డే సందర్భంగా బుధవారం అరుదైన ఫీట్‌ చేశారు. ఏకంగా 108 సూర్య నమస్కారాలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ‘

Manoj - Mounika: మనోజ్‌ పోస్ట్‌ వైరల్‌..

మంచు మనోజ్‌ (Manchu Manoj)భార్య భూమా మౌనిక (Bhuma mounika) యోగా డే సందర్భంగా (Yoga day Feet)బుధవారం అరుదైన ఫీట్‌ చేశారు. ఏకంగా 108 సూర్య నమస్కారాలు (108 Surya namaskarams) చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని మనోజ్‌ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. ‘నా భార్య మౌనిక అంటూ యోగాసనం వేస్తున్న ఫోటోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. యోగా డే సందర్భంగా భూమా మౌనిక తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశారు. ’నా మిత్రులకు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి.. యోగాపై నా ప్రేమకు అంకితం చేస్తున్నా. నాకు యోగాను పరిచయం చేసినందుకు మా అమ్మ శోభా నాగిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని పోస్ట్‌ చేశారు.

2.jpg

దాదాపు నాలుగేళ్ల ప్రేమ తర్వాత ఇటీవల వివాహ బంధంతో ఒకటయ్యారు మంచు మనోజ్‌ - మౌనిక. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. మంచు లక్ష్మీ ప్రసన్న దగ్గరుండి వీరిద్దరి పెళ్లికి పెద్దగా నిలిచారు.

Updated Date - 2023-06-22T15:07:53+05:30 IST