Chandrabose: ఆస్కార్‌తో హైదరాబాద్ రాగానే చంద్రబోస్ చేసిన పని ఇదే!

ABN , First Publish Date - 2023-03-24T19:15:42+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట పురస్కారాన్ని కైవసం చేసుకుంది.

Chandrabose: ఆస్కార్‌తో హైదరాబాద్ రాగానే చంద్రబోస్ చేసిన పని ఇదే!

‘ఆర్ఆర్ఆర్’ (RRR) లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాట పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ పాటను గీత రచయిత చంద్రబోస్ (Chandrabose) రచించారు. అందువల్ల మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కలసి ఆయన ఆస్కార్ అవార్డును అందుకున్నారు. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన వేడుకకు హాజరైన అనంతరం ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రచయితగా తనను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడిని గుర్తు చేసుకుంటూ ఆయన రామా నాయుడు స్టూడియోస్‌కు వెళ్లారు. స్టూడియోలో రామానాయుడు కుమారుడు, నిర్మాత సురేశ్‌బాబుని కలసి నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైన నా ప్రయాణం ఆస్కార్‌ వరకు వెళ్లిందని సంతోషం వ్యక్తం చేశారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌‌తో తనకెంతో అనుబంధముందని తెలిపారు. Suresh-Babu.jpg

‘తాజ్‌మహల్‌’ సినిమాతో చంద్రబోస్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. 1995లో ఈ చిత్రం విడుదలైంది. ఈ మూవీలో ఆయన ‘మంచు కొండల్లోన చంద్రమా’ పాటను రచించారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాట ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ చంద్రబోస్ 28 ఏళ్లు వెనక్కి వెళ్లారు. ‘తాజ్ మహల్’ చిత్రానికి ముప్పలనేని శివ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్‌, సంఘవి, మోనికా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఎంఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. అకాడమీ అవార్డ్ లభించడంతో ఆస్కార్ గెలుపొందిన తొలి తెలుగు గీత రచయితగా రికార్డు సృష్టించారు. చంద్రబోస్ అనేక హిట్ సాంగ్స్‌ను రచించారు. ‘రంగస్థలం’ లోని ‘రంగమ్మ, మంగమ్మ’, ‘పుష్ప’ లోని ‘ఊ అంటవా మావా’ పాటలు ఆయన రచించనవే.

^^^^^^^^^^^^^^^^^^^^

ఇవి కూడా చదవండి:

Nani: ఓ దర్శకుడు తీవ్రంగా అవమానించారు.. మనోవేదనకు గురయ్యా..

SSMB29: మహేశ్ సినిమా కోసం రాజమౌళి వర్క్‌షాప్స్

Suriya: ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య.. ధర వింటే షాకే..

Naatu Naatu: పాటపై సంచలన కామెంట్స్ చేసిన కీరవాణి తండ్రి శివశక్తి దత్తా

Allu Arjun: హీరోయిన్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసిన బన్నీ!

Updated Date - 2023-03-27T11:27:15+05:30 IST