సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Aadi Saikumar: ఈ లవ్లీ స్టార్ సినీ వయస్సు ఎంతో తెలుసా..

ABN, First Publish Date - 2023-02-25T23:33:15+05:30

టాలీవుడ్‌ (Tollywood)కు వారసత్వ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఒకరు. ఈ సినీ ప్రపంచంలో హీరోలు సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే..

Aadi Saikumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్‌ (Tollywood)కు వారసత్వ హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ఆది సాయికుమార్ (Aadi Saikumar) ఒకరు. ఈ సినీ ప్రపంచంలో హీరోలు సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు అయితే.. ఆ సక్సెస్‌ను కాపాడుకునేందుకు పడే కష్టం మరొక ఎత్తు అని చెప్పుకోవాలి. అభిమానుల అంచనాలు అందుకుంటూ నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టే హీరోగా నిలదొక్కుకోవడం మాములు విషయం కాదు. అలాంటి హీరోగా నిలబడేందుకు ‘ప్రేమ కావాలి’ (Prema Kaavali) సినిమాతో హీరోగా పరిచయమైన డైలాగ్ కింగ్ సాయికుమార్ (Sai Kumar) తనయుడు ఆది సాయికుమార్ కష్టపడుతూనే ఉన్నాడు. నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ లవ్లీ స్టార్ (Lovely Star).. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్లు పూర్తయ్యాయి. ఈ పుష్కర కాలంలో ఆది ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ఆయన ప్రయత్నిస్తూనే వచ్చారు.

ఆది సాయికుమార్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు ‘ప్రేమ కావాలి, లవ్‌లీ (Lovely), సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి’ ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేశారు. గత ఏడాది ఆయన ఐదు సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చారు. కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్ (Tees Maar Khan), క్రేజీ ఫెలో, బ్లాక్, అతిథి దేవో భవ, టాప్ గేర్ (Top Gear) అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి.. ‘పులి మేక’ (Puli Meka) అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ప్రస్తుతం ఈ ‘పులి మేక’ వెబ్ సిరీస్‌ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు. ఇలా ఆది తన పన్నెండేళ్ల కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశారు. మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపలేదు. త్వరలోనే ఆయన నటించనున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా తెలియజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

************************************************

Chiranjeevi: రాజశేఖర్ చేసిన పనికి.. చిరు సెల్యూట్ చేశారు

Veera Simha Reddy: ఒక్క నిమిషంలోనే.. ఓటీటీలో ఊచకోత!

Nara Lokesh: మెగాస్టార్ చిరంజీవి అభిమానిని.. ‘వాల్తేరు వీరయ్య’ చూశా..

Nagineedu: నాకస్సలు భయం లేదు.. నేనే రాజు, నేనే మంత్రి (OHRK Promo)


Sir: దర్శకుడే కారణం.. చిరు చెప్పిందే మూర్తిగారు చెప్పారు

Rashmi Gautam: యాసిడ్ పోస్తారట.. కేసు పెట్టాలా? వద్దా?

GlobalStar Ram Charan: రామ్ చరణ్ రేంజ్ మారిపోయిందబ్బా..

Updated Date - 2023-02-25T23:33:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!