Indrasena: ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్’లో మంచి సందేశం ఉంటుంది

ABN , Publish Date - Dec 24 , 2023 | 11:30 PM

‘శాస‌న‌స‌భ’ చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఇంద్ర‌సేన‌. పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఆ చిత్రం త‌న కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని, ‘శాస‌న‌స‌భ’ త‌ర్వాత మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయని చెబుతున్నారు ఇంద్ర‌సేన. ఆయన న‌టించిన తాజా చిత్రం ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌’. డిసెంబర్ 29న విడుదల కాబోతోన్న ఈ చిత్ర విశేషాలను తాజాగా హీరో ఇంద్రసేన మీడియాకు తెలిపారు.

Indrasena: ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్’లో మంచి సందేశం ఉంటుంది
Hero Indrasena

‘శాస‌న‌స‌భ’ (Sasanasabha) చిత్రంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఇంద్ర‌సేన‌ (Indrasena). పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఆ చిత్రం త‌న కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింద‌ని, ‘శాస‌న‌స‌భ’ త‌ర్వాత మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయని చెబుతున్నారు ఇంద్ర‌సేన. ఆయన న‌టించిన తాజా చిత్రం ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌’ (Badmash Gallaki Bumper Offer). ద‌ర్శ‌కుడు ర‌వి చావ‌లి (Ravi Chavali) ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎన్‌. ర‌మేష్ కుమార్ (N Ramesh Kumar) నిర్మించారు. డిసెంబర్ 29న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా హీరో ఇంద్రసేన‌ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.

‘శాస‌న‌స‌భ’ త‌ర్వాత ఇంత గ్యాప్ తీసుకున్నారెందుకు?

‘శాస‌నస‌భ’ చిత్రం న‌టుడిగా ఎంతో గుర్తింపును తీసుకొచ్చింది. ఈ చిత్రం త‌ర్వాత మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. కానీ బాధ్య‌త‌గా సినిమాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. శాస‌న‌స‌భ సినిమా కంటే ముందే ఓకే చేసిన సినిమా ‘బ‌ద్మాష్ గాళ్ల‌కి బంప‌ర్ ఆఫ‌ర్’. ఈ చిత్రం కూడా నా కెరీర్‌ను మ‌రో మెట్టు ఎక్కిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది.


Indrasena-1.jpg

ఇది ఎలాంటి క‌థ?

నేడు స‌మాజంలో జ‌రుగుతున్న మోసాలు, బ్లాక్‌మెయిల్ చుట్టు అల్లుకున్న క‌థ ఇది. పూర్తి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌లో ఆస‌క్తిక‌ర‌మైన స్క్రీన్‌ప్లే‌తో వుంటుంది. ప్ర‌తి పాత్ర ఎంతో స‌హ‌జంగా వుంటుంది. అంతేకాదు ప‌తాక స‌న్నివేశాల్లో మంచి సందేశం వుంటుంది.

ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా వుంటుంది?

‘శాస‌న‌స‌భ’లో నా పాత్ర పూర్తి సీరియ‌స్ లుక్‌లో వుంటుంది. కానీ ఈ చిత్రంలో నా పాత్ర అందుకు పూర్తి విరుద్దంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా వుంటుంది. నా బాడీలాంగ్వేజ్‌కు ప‌ర్‌ఫెక్ట్ సెట్ అయ్యే పాత్ర నాది. న‌టుడిగా మంచి స్కోప్ వున్న పాత్ర, నాకు చాలెంజింగ్‌గా అనిపించింది. సినిమా ప్రారంభంలో నెగెటివ్ షేడ్స్‌తో మొద‌ల‌య్యే నా పాత్ర.. చివ‌రిలో త‌ప్పు తెలుసుకుని రియ‌లైజ్ అవుతుంది. త‌ప్ప‌కుండా నా పాత్ర అంద‌రికీ న‌చ్చుతుంది. (Indrasena About Badmash Gallaki Bumper Offer)

ర‌వి చావ‌లి లాంటి సీనియ‌ర్ ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం ఎలా వ‌చ్చింది?

ర‌విచావ‌లి ద‌ర్శ‌క‌త్వంలో నేను ఇంత‌కు ముందు ‘సూప‌ర్ స్కెచ్’ సినిమాలో న‌టించాను. ఈ సినిమా క‌థ‌కు నేను స‌రిపోతాన‌ని న‌న్ను తీసుకున్నారు. ఆయ‌న లాంటి ప్ర‌తిభ గ‌ల ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే అవ‌కాశం అంద‌రికి రాదు. ఈ విష‌యంలో నేను హ్య‌పీగా ఫీల‌వుతున్నాను.


ఈ చిత్రంలో కొత్త‌ద‌నం ఏమిటి?

ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు రాసుకున్న క‌థే బ‌లం. యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది. విజయ్‌.సి.కుమార్ కెమెరా గొప్ప‌త‌నం, భోలే షావ‌లి పాట‌లు, మార్తండ్ కె. వెంక‌టేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు అద‌న‌పు బ‌లాలు.

విల‌న్‌గా న‌టిస్తారా?

‘శాస‌నస‌భ’ త‌ర్వాత చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. నా పాత్ర, క‌థ న‌చ్చితే విల‌న్‌గా న‌టించడానికి కూడా రెడీగా వున్నాను.

మీ తదుప‌రి చిత్రాలు?

ప్రముఖ ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రానున్న చిత్రంలో నెగిటివ్ రోల్‌లో క‌నిపించబోతున్నాను. దీంతో పాటు నేను హీరోగా రెండు చిత్రాలు త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్నాయి.


ఇవి కూడా చదవండి:

====================

*Suhasini: ఇప్పుడొస్తున్న సినిమాలపై సుహాసిని హాట్ హాట్ కామెంట్స్

**********************************

*Bonda Mani: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

*******************************

*Salaar: రికార్డ్ బ్రేకింగ్ బ్లాక్‌బస్టర్.. రెండో రోజూ కలెక్షన్ల ‘వరదే’!

********************************

*Sriya Reddy: పవన్ ‘ఓజీ’లో చేస్తున్నందుకు అంతా ఏమంటున్నారంటే?

*********************************

Updated Date - Dec 24 , 2023 | 11:30 PM