సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vanitha Vijay Kumar: రిలేషన్‌ మాత్రమే.. పెళ్ళి జరగలేదు.. దయచేసి అలా రాయవద్దు

ABN, First Publish Date - 2023-05-04T20:10:50+05:30

పీటర్‌ పాల్‌ మృతిపై స్పందించాలా? వద్దా? అన్న సందిగ్ధంతో చాలా ఓపిక పట్టాను. మీడియా నాకు అవకాశం లేకుండా చేసింది. మీడియా మీదున్న గౌరవంతో ఒక విషయం గుర్తు చేస్తున్నా...

Vanitha Vijay Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకు పీటర్ పాల్‌ (Peter Paul)కు న్యాయబద్ధంగా పెళ్ళి జరగలేదని, కొన్ని రోజుల పాటు ఆయనతో రిలేషన్‌లో మాత్రమే ఉన్నానని నటి వనితా విజయకుమార్‌ (Vanitha Vijay Kumar) చెప్పారు. అందువల్ల ఆయన తనకు భర్త కాదు.. తాను ఆయనకు భార్యను కాదని ఆమె స్పష్టం చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన పీటర్‌ పాల్‌ ఇటీవల మృతి చెందారు. వనితా విజయకుమార్‌ మూడో భర్తగా ఈ మధ్య పీటర్ పేరు బాగా వినబడింది. మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వనితా విజయ్ కుమార్ వివరణ ఇచ్చారు.

‘‘పీటర్‌ పాల్‌ మృతిపై స్పందించాలా? వద్దా? అన్న సందిగ్ధంతో చాలా ఓపిక పట్టాను. మీడియా నాకు అవకాశం లేకుండా చేసింది. మీడియా మీదున్న గౌరవంతో ఒక విషయం గుర్తు చేస్తున్నా... పీటర్‌ పాల్‌తో నాకు న్యాయబద్ధంగా వివాహం జరగలేదు. 2020లో కొన్ని రోజుల పాటు ఆయనతో రిలేషన్‌లో ఉన్నా. ఆ బంధం కూడా ఆ సంవత్సరమే ముగిసింది. నేను ఆయనకు భార్యను కాదు. ఆయన నాకు భర్త కాదు. వనితా విజయకుమార్‌ మూడో భర్త చనిపోయాడంటూ రాస్తున్న వార్తలు నిలిపివేయండి. నాకు భర్త లేడు. ఒంటిరిగానే ఉంటున్నా. నేను ఏ ఒక్క విషయానికి బాధపడటం లేదు. పైగా చాలా సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నా. మీ అందరికీ ఇదే నా విన్నపం. ఇట్లు.. మిస్‌ వనితా విజయకుమార్‌’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వనితా విజయ్ కుమార్ ఒక సుధీర్ఘ పోస్ట్‌‌ చేశారు. (Vanitha Vijay Kumar Letter on Her Third Husband)

వనితా విజయ్ కుమార్ చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ‘‘ఎందుకిలా అబద్ధమాడతావ్. క్రిస్టియన్ పద్ధతిలో మీరు వివాహం చేసుకోవడమే కాకుండా.. మీడియా ముందు అతనిని కిస్ చేశావ్. కాబట్టి నీకు ఇలా ఖండించే అర్హత లేదు. నీవు అతనితో కలిసి ఉన్నావా? లేదా? అనేది మ్యాటర్ కాదు. అతడిని పెళ్లి చేసుకున్నావ్ కాబట్టి.. అతను నీకు మూడో భర్తే. దానిని తప్పు అని చెప్పే అర్హత నీకు లేదు. ఇప్పుడంతా అయిపోయింది.. ఇప్పటికైనా మంచి మనిషిలా ఉండు’’ అంటూ కొందరు నెటిజన్లు ఆమె పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. వనితా విజయ్ కుమార్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె నరేష్ (Naresh), పవిత్ర (Pavitra)ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘మళ్ళీ పెళ్లి’ (Malli Pelli) అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో నరేష్ భార్య రమ్య రఘుపతి (Ramya Raghupathi) రోల్‌ను ఆమె చేస్తోంది.


ఇవి కూడా చదవండి:

************************************************

*Parineeti and Raghav: క్రికెట్ స్టేడియంలో ప్రేమికులు హల్చల్

*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..

*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?

*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్‌ కాపాడింది

*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి

Updated Date - 2023-05-04T20:10:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!