సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

N Lingusamy: దర్శకుడు లింగుస్వామికి హైకోర్టులో ఊరట

ABN, First Publish Date - 2023-04-26T13:39:07+05:30

చెక్‌ బౌన్స్‌ కేసు (Cheque Bounce Case)లో ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.లింగుస్వామి (Director N Lingusamy)కి మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)లో ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు

Director N Lingusamy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెక్‌ బౌన్స్‌ కేసు (Cheque Bounce Case)లో ప్రముఖ సినీ దర్శకుడు ఎన్‌.లింగుస్వామి (Director N Lingusamy)కి మద్రాస్‌ హైకోర్టు (Madras High Court)లో ఊరట లభించింది. కింది కోర్టు ఆయనకు విధించిన 6 నెలల జైలు శిక్షపై స్టే విధించింది. ఎన్‌.లింగుస్వామి ఆయన సోదరుడు సుభాష్‌ చంద్రబోస్‌ (Subhash Chandrabose) కలిసి ఒక చిత్ర నిర్మాణం కోసం తమ సొంత నిర్మాణ సంస్థ తిరుపతి బ్రదర్స్‌ (Tirupati Brothers) పేరుతో 2014లో పీవీపీ కేపిటల్స్ (PVP Capitals) అనే ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.1.3 కోట్ల రుణం తీసుకున్నారు. ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించే క్రమంలో ఫైనాన్స్‌ కంపెనీకి రూ.1.35 కోట్లకు చెక్‌ ఇవ్వగా, బ్యాంకులో తగినంత నిల్వ లేని కారణంగా చెక్‌ బౌన్స్‌ అయింది. దీంతో ఫైనాన్స్‌ కంపెనీ చెన్నై సైదాపేట కోర్టును (The Metropolitan Magistrate Court, Saidapet) ఆశ్రయించగా, వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఈ శిక్షను చెన్నై జిల్లా ప్రిన్సిపల్‌ సెషన్స్‌ కోర్టు కూడా ఖరారు చేసింది. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి వి.శివజ్ఞానం (V Sivagnanam) సమక్షంలో సోమవారం విచారణకు వచ్చింది. అపుడు లింగుస్వామి తరపున హాజరైన న్యాయవాది ఇప్పటికే 20 శాతం సొమ్మును చెల్లించామని, మరో 20 శాతం సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. దీంతో 20 శాతం సొమ్మును ఆరు వారాల్లో డిపాజిట్‌ చేయాలని ఆదేశిస్తూ కింది కోర్టులు ఖరారు చేసిన ఆరు నెలల జైలు శిక్షను నిలిపివేస్తూ ఆదేశించారు. (Big Relief to Director N Lingusamy)

లింగుస్వామి విషయానికి వస్తే.. రీసెంట్‌గా ఆయన తెలుగు, తమిళ భాషల్లో ‘ది వారియర్’ (The Warriorr) అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా విజయం సాధించలేదు. రామ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఈ సినిమా తర్వాత లింగుస్వామి తన తదుపరి చిత్రానికి సంబంధించి ఎటువంటి ప్రకటనా చేయలేదు. త్వరలోనే ఆయన ఓ స్టార్ హీరో (Star Hero)ని డైరెక్ట్ చేయబోతున్నట్లుగా అయితే కోలీవుడ్ మీడియా (Kollywood Media)లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

************************************************

*#HBDSamuthirakani: సముద్రఖనికి ‘PKSDT’ టీమ్ సర్‌ప్రైజ్

*Young Tiger NTR: అవకాశం వస్తే రెడీ... ఎన్టీఆర్ నటనకు హాలీవుడ్ దర్శకుడు ఫిదా!

*Director Teja: నువ్వేం పీకావ్.. అంటూ హీరో గోపీచంద్‌తో పబ్లిగ్గా గొడవకు దిగిన తేజ!

*Dimple Hayathi: నేను, శ్రీలీల.. ఇంకా నలుగురు రావాలి.. అప్పుడే సెలబ్రేషన్స్

*IT Raids: మైత్రీ పెట్టుబడులపై కీలక సమాచారం రాబట్టిన ఐటీ.. స్టార్ హీరో, దర్శకుడు అడ్డంగా బుక్కయినట్లేనా?

Updated Date - 2023-04-26T13:39:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!