సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Re Release: రజనీకాంత్, అజిత్‌ల ఆ సినిమాలు రీ రిలీజ్.. ఎప్పుడంటే?

ABN, First Publish Date - 2023-04-28T15:37:39+05:30

టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజై (Re Release) కలెక్షన్స్‌ను కొల్లగొడుతోన్న విషయం తెలిసిందే. ఇది గమనించిన కోలీవుడ్ మేకర్స్ సైతం అక్కడి స్టార్ హీరోల చిత్రాలను

Rajinikanth and Ajith Kumar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ (Tollywood) ‌నుంచి కోలీవుడ్‌ (Kollywood)కు కూడా రీ రిలీజ్ ట్రెండ్ చేరింది. టాలీవుడ్‌లో స్టార్ హీరోల చిత్రాలు రీ రిలీజై (Re Release) కలెక్షన్స్‌ను కొల్లగొడుతోన్న విషయం తెలిసిందే. ఇది గమనించిన కోలీవుడ్ మేకర్స్ సైతం అక్కడి స్టార్ హీరోల చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో ముందుగా సూపర్ స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), మరో అగ్రహీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar)లు నటించిన రెండు పాత చిత్రాలను మళ్ళీ రిలీజ్‌ చేయబోతున్నట్లుగా తాజాగా కోలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిస్తున్నాయి. ఈ ఇద్దరి హీరోల సినిమాలను డిజిటలైజ్‌ చేసి విడుదల చేసేందుకు ఆయా చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రాలు ఏమిటంటే..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, రాధికా ఆప్టేలు కలిసి నటించి, 2016లో విడుదలైన చిత్రం ‘కబాలి’ (Kabali). ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్‌.థాను నిర్మించారు. ఈ మూవీ క్లైమాక్స్‌లో కొన్ని మార్పులు చేసి, మూవీ రన్నింగ్‌ టైమ్‌ను కూడా తగ్గించి దీపావళికి రీ-రిలీజ్‌ చేసేందుకు నిర్మాత చర్యలు చేపట్టారు. ‘కబాలి’ సినిమా విడుదలకు ముందు బీభత్సమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. కానీ విడుదల తర్వాత ఈ సినిమా ఈ క్రేజ్ తగినట్లుగా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్‌పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడీ సినిమాని సరికొత్తగా రెడీ చేసి.. మళ్లీ విడుదల చేసేలా నిర్మాత ప్లాన్ చేస్తున్నారు. (Kabali Re Release Update)

అదేవిధంగా హీరో అజిత్‌ (Ajith) నటించిన తొలి చిత్రం ‘అమరావతి’ (Amaravathi). దీన్ని ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని రీ రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. పాత వెర్షన్‌ను డిజిటలైజ్‌ చేసి, మే మొదటి వారంలో రిలీజ్‌ చేసేందుకు నిర్మాత సన్నాహాలు చేపట్టారు. ‘అమరావతి’ రీ రిలీజ్‌కు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు సహకరించాలని నిర్మాత చోళ పొన్నురంగం విఙ్ఞప్తి చేసినట్లుగా కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి (Ajith First Film Re Release Update). ఈ రెండు సినిమాలే కాదు.. లైన్‌లో ఇతర స్టార్ హీరోల పాత సినిమాలను డిజిటలైజ్ చేసి మళ్లీ విడుదల చేసేందుకు అక్కడి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:

************************************************

*RRR Side Dancer: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో సైడ్ డ్యాన్సర్‌గా చేసిన వ్యక్తి అరెస్ట్.. ఎందుకంటే?

*PS2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ ప్రత్యేక షోలు రద్దు.. సినిమాపై చిత్రయూనిట్ స్పందనిదే..

*‘PS2’ Twitter Review: ‘బాహుబలి’‌ సరిపోదు.. ఇండియన్ సినిమా గర్వపడే చిత్రమిది

*Agent Twitter Review: అయ్యగారి సినిమా టాక్.. ఏదో తేడాగా ఉందే..?

*Surender Reddy Universe: ‘ఏజెంట్’లో ‘ధృవ’.. వీడియో అదిరింది

Updated Date - 2023-04-28T15:38:48+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!