కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghava Lawrence: రజనీ రూపంలో రాఘవేంద్రుడిని చూశా..

ABN, First Publish Date - 2023-11-19T11:16:28+05:30

తాను కొలిచే దైవమైన రాఘవేంద్రస్వామిని కనులారా చూడలేదని.. కానీ, తన గురువు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రూపంలో ఆయన్ను ప్రత్యక్షంగా చూస్తూ, ఆయనతో సంభాషిస్తున్నానని మల్టీ టాలెంటెడ్‌ నటుడు రాఘవ లారెన్స్‌ అన్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్‌ తండ-2’ దీపావళికి విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను తాజాగా చెన్నైలో నిర్వహించారు.

Raghava Lawrence in Jigarthanda DoubleX

తాను కొలిచే దైవమైన రాఘవేంద్రస్వామి (Lord Raghavendra)ని కనులారా చూడలేదని.. కానీ, తన గురువు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) రూపంలో ఆయన్ను ప్రత్యక్షంగా చూస్తూ, ఆయనతో సంభాషిస్తున్నానని మల్టీ టాలెంటెడ్‌ నటుడు రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) అన్నారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraj) దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్‌ తండ-2’ (Jigarthanda DoubleX) దీపావళికి విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం సక్సెస్‌ మీట్‌ను తాజాగా చెన్నైలో నిర్వహించారు. ఇందులో ఆ చిత్ర హీరోలు రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య (SJ Suryah), దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ (Karthik Subbaraj), సంగీత దర్శకుడు సంతోష్‌ నారాయణన్‌, నటుడు నవీన్‌ చంద్ర (Naveen Chandra) తదితరులు పాల్గొన్నారు.

ముందుగా లారెన్స్‌ మాట్లాడుతూ... ‘జిగర్‌ తండ-2’ విడుదలకు రెండు రోజుల ముందుగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌, హీరో ధనుష్‌ చూసి సూపర్బ్‌గా ఉన్నట్టు ట్వీట్‌ చేశారు. చివరి 45 నిమిషాలు ఫెంటాస్టిక్‌ అంటూ కొనియాడారు. ఆ తర్వాత దర్శకుడు శంకర్‌తో పాటు అనేక మంది దర్శకులు ఇదే తరహా అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సినిమా చూసిన తర్వాత స్వయంగా ఫోన్‌ చేయడం, ఇంటికి పిలిపించుకుని అభినందించడం జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం. దాదాపు గంటపాటు మాతో కలిసి ఆయన ఈ సినిమా గురించి మాట్లాడారు. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ సినిమా చూసిన ఆయన చిత్ర బృందాన్ని అభినందిస్తూ ప్రత్యేకంగా ఒక లేఖ విడుదల చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. (Raghava Lawrence Speech)


ఎస్‌జే సూర్య (SJ Suryah) మాట్లాడుతూ... ఎంజీఆర్‌, శివాజీ గణేశన్‌ల కంటే నటనలో మేటి ఎం.ఆర్‌.రాధా. ఆయనతో నన్ను రజనీకాంత్‌ పోల్చడం ఈ జన్మకు లభించిన అతిపెద్ద ప్రశంస. ‘అపూర్వం’ అంటూ రజనీకాంత్‌ చేసిన ప్రశంస మాకు ఒక బూస్ట్‌ వంటిది. ఆయన ప్రశంసకు తగిన విధంగా మరింత మెరుగ్గా నటించి, ప్రేక్షకులను మెప్పిస్తానని అన్నారు. దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రం విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని అన్నారు.


ఇవి కూడా చదవండి:

========================

*Hi Nanna Party: పోటీలోకి ‘హాయ్ నాన్న’ పార్టీ.. మేనిఫెస్టో విడుదల

*******************************

*Rajinikanth: ‘ముత్తు’ రీ రిలీజ్ డేట్ ఫిక్సయింది.. థిల్లాన థిల్లాన దుమ్మురేపుతుందా..

*******************************

*Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?

********************************

*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!

********************************

Updated Date - 2023-11-19T11:16:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!