Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-18T15:46:45+05:30 IST

జయం రవి, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సైరెన్’. ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ని శుక్రవారం టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు చేతుల మీదుగా విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ టీజర్ ట్రెండింగ్‌లో ఉంది.

Siren Teaser: మంచోడు.. మహా మంచోడిలా నటిస్తే ఎలా ఉంటుందో తెలుసా?
Siren Movie Still

జ‌యం ర‌వి (Jayam Ravi) హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘సైరెన్‌’ (Siren). హోమ్ మూవీ మేక‌ర్స్ (Home Movie Makers) బ్యాన‌ర్‌పై సుజాత విజ‌య్ కుమార్ (Sujatha Vijay Kumar) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆంటోని భాగ్య‌రాజ్ (Antony Bhagyaraj) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శుక్ర‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) విడుద‌ల చేశారు. కోలీవుడ్‌లో వ‌రుస సినిమాలతో సెన్సేషన్‌ని క్రియేట్ చేస్తోన్న జ‌యం ర‌వి నుండి వస్తోన్న ఈ ‘సైర‌న్‌’ మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో జయం రవి స‌రికొత్త‌గా తొలిసారి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో క‌నిపిస్తున్నారు. (Siren Movie Teaser Talk)

Keerthi-Suresh.jpg

టీజర్ విషయానికి వస్తే.. సైరెన్‌తో వెళ్లే అంబులెన్స్, జ‌యం ర‌వి సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్‌లో ఖైదీగా క‌నిపించ‌టం క్యూరియాసిటీని పెంచాయి. పెరోల్‌పై జ‌యం ర‌వి జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే సీన్ ద్వారా హీరో క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేశారు మేక‌ర్స్‌. టీజ‌ర్‌లో ప్ర‌ధానంగా రెండు పాత్ర‌ల మ‌ధ్య న‌డిచే క‌థ ఇద‌ని చూపించారు. ఖైదీ పాత్ర‌లో జ‌యం ర‌వి న‌టిస్తుండ‌గా, పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో కీర్తి సురేష్ (Keerthy Suresh) న‌టిస్తున్నారు. సినిమాలో డ్రామా, ట్విస్టులు, ట‌ర్నులు చూస్తుంటే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మ‌రింత పెంచుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటించినట్లుగా ఈ టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. ఆమె పాత్రే ఈ చిత్రానికి కీలకం అనేది అర్థమవుతోంది.


Jayam-Ravi.jpg

‘అభిమ‌న్యుడు, విశ్వాసం, హీరో’ వంటి ప‌లు చిత్రాల‌కు రైట‌ర్‌గా ప్రూవ్ చేసుకున్న ఆంటోని భాగ్యరాజ్.. ఈ ‘సైరెన్‌’ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌, యాక్ష‌న్‌, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కాంబినేష‌న్‌లో ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో రూపొందిస్తున్నారు. జ‌యం ర‌వి త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నడూ చేయ‌ని విధంగా రెండు డిఫ‌రెంట్ లుక్స్‌తో మెప్పించ‌బోతున్నారు. అలాగే జ‌యం ర‌వి స‌ర‌స‌న కీర్తి సురేష్ తొలిసారి న‌టిస్తుంది. యోగి బాబు త‌న‌దైన కామెడీ పంచుల‌తో న‌వ్వించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో కీల‌క పాత్ర‌ను పోషించారనేది ఈ టీజర్ (Siren Teaser) చూస్తుంటే తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్నాయని.. త్వ‌ర‌లోనే సినిమా ట్రైల‌ర్‌, ఆడియో, మూవీ రిలీజ్ డేట్‌కు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.


ఇవి కూడా చదవండి:

========================

*Unstoppable with NBK: ‘వైల్డెస్ట్ ఎపిసోడ్ ప్రోమో’.. బాలయ్యను ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ హీరో..!

********************************

*Varalaxmi Sarathkumar: ‘కోట బొమ్మాళి పీఎస్‌’ ఎలా ఉంటుందంటే..?

************************************

*KR Vijaya: కెఆర్ విజయ @ 60

*****************************

Updated Date - 2023-11-18T15:46:46+05:30 IST